నాలుగేళ్ల నిరీక్షణకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల నిరీక్షణకు మోక్షం

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

జనగామ: సామాజిక భద్రత పింఛన్ల పథకం ‘చేయూత’లో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌ బాధితులు, వికలాంగులు, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో అర్హులైన పేద కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసా లభించనుంది.

పాత లెక్కలపై ఆరా

జిల్లాలో కొత్త సామాజిక భద్రత పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో అధికార యంత్రాంగం పాత పింఛన్ల లెక్కలను సైతం సరిచూస్తోంది. ప్రస్తుతం జిల్లాలో అన్ని కేటగిరీలకు కలిపి 73,829 మందికి ప్రతీ నెల రూ.18.32 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. 2022 ఏప్రిల్‌ నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ కేటగిరీల్లో సుమారు 25,256 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఎంపీడీఓ స్థాయిలో మరోసారి పరిశీలించి జిల్లా కేంద్రానికి పంపిస్తారు. అక్కడ కూడా ఎంక్వయిరీ పూర్తి చేసి కలెక్టర్‌ ఆమోదానికి నివేదిక సమర్పించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరంగా పేర్కొంటున్నారు.

మరణించిన వారి పేర్ల తొలగింపు

కొత్త పింఛన్ల మంజూరుకు మండలాలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక లాగిన్‌లు కేటాయించడంతో ప్రక్రియ వేగవంతం కానుంది. ఇదే సమయంలో డూప్లికేట్‌ పింఛన్లు, మరణించిన లబ్ధిదారుల వివరాలపైనా అధికారులు దృష్టిసారించారు. జిల్లాలో సుమారు 550 మంది పింఛన్‌దారులు మృతి చెందినట్లు గుర్తించి ప్రత్యేక నివేదిక రూపొందించారు. వీరిలో 80 శాతం మంది రెండు నెలల క్రితం, మరో 20 శాతం మంది ఆరు నెలల క్రితం మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే ఆయా ఖాతాలను ఫ్రీజ్‌ చేసిన అధికారులు, మరణించిన వారి పేరుతో జమ అయిన పింఛనన్‌ మొత్తాన్ని పూర్తి స్థాయిలో రికవరీ చేసేందు కు చర్యలు చేపట్టనున్నారు.

పింఛన్‌ ఇలా

వితంతువులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున పింఛన్‌ అందించనున్నారు. గీత, చేనేత కార్మికులకు రూ.2,016 చొప్పున మంజూరు చేయనున్నారు. ఫైలేరియా, డయాలసిస్‌ బాధితులకు వయోపరిమితి లేకుండా నిర్దేశిత నిబంధనల మేరకు పింఛనన్‌ కల్పించనున్నారు. ఆయా కేటగిరీలకు సంబంధించి వయసు, వైకల్యం, వైద్య పరిస్థితి, శాఖల ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. అదే సమయంలో అనర్హుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. నిర్దేశిత పరిమితికి మించి వ్యవసాయ భూమి, అధిక ఆదాయం ఉన్న కుటుంబాలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఉద్యోగులు ఉన్న కుటుంబాలు, వైద్యులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, పెద్ద వ్యాపార సంస్థల యజమానులు, నాలుగు చక్రాల లేదా భారీ వాహనాల యజమానులు పింఛన్‌కు అనర్హులుగా పరిగణించనున్నారు.

దశలవారీగా పరిశీలన

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, బిల్‌ కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా స్వీకరించి చేయూత పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, 360 డిగ్రీల డేటాబేస్‌ ఆధారంగా వివరాలను పరిశీలిస్తారు. అర్హుల జాబితాకు కలెక్టర్‌ ఆమోదం అనంతరం మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు.

వృద్ధుల సంగతేంటి?

కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడినా వృద్ధాప్య పింఛన్‌పై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా అ ర్హత పొందే వృద్ధులకు వయోపరిమితి ఎంత అనే అంశాలపై మార్గదర్శకాల్లో వివరాలు లేకపోవడంతో అయోమయం నెలకొంది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

చేనేత కార్మికులు

306

గీత కార్మికులు 852

దివ్యాంగులు 3,426

బీడీ కార్మికులు 142

ఒంటరి

మహిళలు

336

వితంతువులు 3,491

వృద్ధాప్య

పింఛన్లు

6,332

ఇతరులు

8

దరఖాస్తులు ఇలా..

జిల్లాలో కొత్త పింఛన్లకు శ్రీకారం

వృద్ధాప్య పింఛన్‌పై వీడని సందిగ్ధత

జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 25,256

ప్రతీనెల 73,829 మందికి రూ.18.32కోట్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement