● గ్రూపు రాజకీయాలకు
తావులేకుండా ఉండాలి
● ఎంపీ కావ్య, ఎమ్మెల్యే యశస్విని,
డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి
జనగామ: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా, క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నా యకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పిలుపుని చ్చారు. జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హా ల్‌లో డీసీసీ సమీక్ష సమావేశం, నూతన జిల్లా, మండల, టౌన్ కాంగ్రెస్ కమిటీల సన్మానం, ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రూపు రాజకీయాలకు దూ రంగా ఉండాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. జనగామలో కాంగ్రెస్ జెండా బలంగా ఎగరాలంటే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి అన్నారు. వ్యక్తిగత విభేదాలు, గ్రూపు రాజకీయాలకు తావులేకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. నాయకుల మధ్య సమస్యలు ఉంటే పరస్పరం పరిష్కరించుకుని పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమై సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, జనగామ మున్సిప ల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, నాయకులు రాంబాబు, తాటికొండ వినయ్, లావణ్య శిరీష్‌రెడ్డి, వేమల్ల సత్యనారాయణ రెడ్డి, కంచ రా ములు, డాక్టర్ రాజమౌళి, లింగాల జగదీష్ చంద్రరెడ్డి, కొత్త కరుణాకర్‌రెడ్డి, గుడి వంశీధర్ రెడ్డి, నూకల బాల్‌రెడ్డి, మేడ శ్రీనివాస్, ఎండీ అన్వర్, ఎండీ మదార్ తదితరులు పాల్గొన్నారు.


