జనగామ రూరల్: పీఆర్సీని ప్రకటించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల శాఖ అధ్యక్షుడు బొగ్గారపు శ్రీనివాసు అ ధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే పీఆర్సీని ప్రకటించాలన్నారు. అలాగే అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కార్డులు అమలు అయ్యేలా చూడాలన్నారు. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఐదుగురు టీచర్స్ ఉండే విధంగా చూడాలన్నారు. అనంతరం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అయిత నరసింహులు ఆధ్వర్యంలో నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బొగ్గారపు శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శిగా ఎండీ జలీల్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.


