జనగామ రూరల్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ.ఆనంద్, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్ష పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. కలెక్టరెట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ వీసీలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో 24/7 పని చేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సంజయ్ జాజు


