వేతనాలు అందేదెన్నడో..! | - | Sakshi
Sakshi News home page

వేతనాలు అందేదెన్నడో..!

Jul 31 2026 12:39 AM | Updated on Jul 31 2026 12:39 AM

ప్రధాన డిమాండ్లు..

ఒకటో తేదీన వేతనాలు

అందించాలి

జనగామ రూరల్‌: వీబీజీ రాంజీలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈసీలు, సిబ్బందికి గత కొన్ని 3 నెలలుగా జీతాలు అందడం లేదు. గ్రామీణ ప్రాంతంలో కూలీలకు ఉపాధి పనులు కల్పించే కీలక ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు డబ్బులు లేక స్థానిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 250 మందికిపైగా 3 నెలల జీతాలు అందలేదు. పరిపాలనాపరమైన అనుమతుల్లో ఆలస్యం కారణంగానే ఈ జీతాల చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. తక్షణమే స్పందించి తమ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డీఆర్‌డీఓకు తెలంగాణ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అయితే ప్రభుత్వం ఎంపీడీఓలకు వాహన అలవెన్స్‌లు ఇతర ఖర్చులు చెల్లించగా ఉద్యోగుల జీతాలు ఇవ్వకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.

వేతనాల లేక అప్పులు

బీవీజీ రాంజీ పథకంలో పని చేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లకు రూ.30 వేల పైన, కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ.21 వేల పైన, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.11 వేల పైన వేతనాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 181 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లతో కలిసి 250 మందికి వేతనాలు రావాల్సి ఉంది. 3 నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణకు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం బైకు పెట్రోలు కోసం సైతం డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని ఓ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చాలా మంది ఈఎంఐలు, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. కొత్తగా స్కూళ్లు, కాలేజీల్లో తమ పిల్లలను చేర్పించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం వేతనాలు సాఫీగానే రాగా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నామని.. ప్రభుత్వం స్పందించి తమ వేతనాలను ఒకటో తేదీన అందేలా చూడాలని కోరుతున్నారు.

ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయీస్‌, వీబీజీ రాంజీ సిబ్బందికి అనుకూలమైన పే స్కేల్‌ అమలు చేయాలి.

అర్హత కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ పాలసీ ప్రవేశపెట్టాలి.

కేడర్‌ సీనియార్టీ అధారంగా సేవల క్రమబద్దీకరణ జరగాలి.

ప్రతీ నెల ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.

పెరిగిన ధరలకు అనుగూలంగా వేతనాలు పెంచి ప్రభుత్వ పాలసీలు అందేలా చూడాలి.

గ్రామీణ స్థాయిలో పేదలకు పనులు కల్పిస్తున్న ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. రెండు ఏళ్ల క్రితం వరకు సరిగా వచ్చిన వేతనాలు ప్రస్తుతం రెండు నుంచి మూడు నెలలు సమయం పడుతుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఆలాగే సీనియార్టీ ఆధారంగా ఉద్యోగుల సేవల క్రమబద్దీకరణ చేపట్టాలి.

– మాధవరెడ్డి,

ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు

వీబీజీ రాంజీ ఉద్యోగుల ఎదురుచూపులు

3 నెలలుగా అందని వేతనాలు

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు

250పైగా ఉద్యోగుల ఇక్కట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement