డేంజర్‌ ఫుడ్‌ | - | Sakshi
Sakshi News home page

డేంజర్‌ ఫుడ్‌

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026

జనగామ: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల తయారీ, పరిశుభ్రత లోపాలు, నాణ్యతలేని వంటకాల విక్రయంపై వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఫుడ్‌సేఫ్టీ, మున్సిపల్‌ శాఖలు పలువురు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలపై దాడులు నిర్వహించి భారీ జరిమానాలు విధిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.

నిరంతరం తనిఖీలు చేస్తేనే..

జిల్లా కేంద్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, జ్యూస్‌ పాయింట్లు, స్వీట్‌హౌస్‌లు, టిఫిన్‌ సెంటర్లు, నాన్‌న్‌వెజ్‌ కేంద్రాలు, చిన్న సమోసా తయారీ యూనిట్లు, స్నాక్స్‌ తయారీ కేంద్రాలు, వైన్‌న్స్‌ పర్మిట్‌ రూంలు, మీల్స్‌ హోటల్‌ విభాగాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు ఎంత మేరకు పాటిస్తున్నారనే సందేహాలు వినియోగదారుల్లో పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తున్న ఆందోళనకర అంశాల నేపథ్యంలో జిల్లాలో కూడా సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నిబంధనలు పాటిస్తున్నారా?

బేకరీల్లో బ్రెడ్‌, కేకులు, ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే నీటి నాణ్యత, తయారీ ప్రదేశాల పరిశుభ్రత, నిల్వ విధానాలపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాన్‌వెజ్‌ హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు విక్రయిస్తున్నారా, ఒకే నూనెను పదేపదే ఉపయోగిస్తున్నారా, ప్రమాదకర కృత్రిమ రంగులను కలుపుతున్నారా అనే అంశాలపై కఠిన తనిఖీలు అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఫాస్ట్‌ఫుడ్‌ సంగతేంటి..

ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో ఉదయం తయారు చేసిన నూడుల్స్‌, ప్రైడ్‌ రైస్‌, మంచూరియా వంటి పదార్థాలను రోజంతా బహిరంగంగా ఉంచడం, దుమ్ము, కాలుష్యం నుంచి రక్షించే చర్యలు లేకపోవడం కూడా ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని అంటున్నారు. కేవలం జరిమానాలు విధించడం వరకు మాత్రమే పరిమితం కాకుండా, నిబంధనల అమలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, వినియోగదారుల ఆరోగ్య రక్షణపై ఫుడ్‌ సేఫ్టీ, మున్సిపల్‌ శాఖలు నిరంతర తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

అనుమతులపై ఆరా తీయాలి

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, టీ దుకాణాలు, గప్‌చుప్‌ బండ్లు, బేకరీలు తదితర ఆహార విక్రయ కేంద్రాలకు ఫుడ్‌ లైసెన్స్‌, ట్రేడ్‌ లైసెన్స్‌తో పాటు ఇతర తప్పనిసరి అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని పలు ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, టీ దుకాణాలు మురుగు కాలువలపైనే నిర్వహిస్తుండటంతో అక్కడి నుంచి వచ్చే దుర్వాసన ఆహార పదార్థాలపై ప్రభావం చూపుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

శుచి, శుభ్రత ఉట్టిదేనా..!

ఆహార తయారీలో వినియోగించే వంటనూనె, పిండి, మసాలాలు, కృత్రిమ రంగులు, నీటి నాణ్యతపై ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు. అనేక హోటళ్లలో వంటశాలలు, ప్లేట్లు శుభ్రం చేసే ప్రదేశాలు, చేతులు కడుక్కునే ప్రాంతాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. టీ గ్లాసులు, ప్లేట్లను రోజంతా అదే నీటితో కడుగుతున్న ఘటనలను గతంలో అధికారులు గుర్తించిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని హోటళ్లు, ఇతర వాటిలో ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న ప్లేట్లను ఒకేచోట వేయ డం.. రాత్రి శుభ్రం చేసే సమయంలో అప్పటికే ఎలుకలు, ఇతర క్రిమికీటకాలు వాటిపై తిరుగుతూ ప్రమాదాన్ని పెంచుతున్నాయని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.

నాణ్యత ఎక్కడ?.. పరిశుభ్రత ఏదీ?

వాడుతున్న నూనె ఏదీ..

కలర్ల మాటేమిటి?...

బేకరీల నుంచి బిర్యానీ వరకు

ఆహార నాణ్యతపై అనుమానాలు!

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై నిఘా

పెంచాలంటున్న వినియోగదారులు

జరిమానాలే కాదు..నిబంధనలు

తప్పనిసరి చేయాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement