● అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రఘునాథపల్లి: ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేయాలని, రాజ్యాంగాన్ని మొత్తంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. మండలంలోని భాంజీపేటలో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించుకోవాలని కోరారు. కుల వ్యవస్థ ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, సర్పంచ్ గైని శ్రీనివాస్‌గౌడ్, గొరిగ రవి, గంగాధర రామేశ్వర్‌రావు, చాట్ల యాదగిరి, బైరపాక యాదగిరి, మోత్కూరి రామేశ్వర్, శాడ మల్లేష్, అంజనేయులు, చాట్ల మైసయ్య, అంతగల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కల సాకారం
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదలు సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని తానేదార్‌పల్లి గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను, రూ.35లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మే 31లోగా నిర్మాణాలు పూర్తిచేసి గృహ ప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు బెలిదె వెంకన్న, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, సర్పంచ్ మంతెన హరితఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు దుంపల పద్మారెడ్డి, మాచర్ల కుమారస్వామి, నాయకులు పాల్గొన్నారు.


