ఇంటర్‌ సెకండియర్‌లో ‘ఎస్‌ఆర్‌’ విజయభేరి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సెకండియర్‌లో ‘ఎస్‌ఆర్‌’ విజయభేరి

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

విద్యారణ్యపురి: ఇంటర్మీ డియట్‌ సెకండియర్‌ పరీక్షల ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యార్థులు విజయభేరి మోగించారని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. ఎంపీసీ విభాగంలో కె. రోహిని 1000 మార్కులకుగాను 996మార్కులు, సీహెచ్‌ ఫ్లోరెన్స్‌రూథ్‌ 996మార్కులు, బీపీసీ విభాగంలో ఎన్‌. సాయికిరణ్‌ 995 మార్కులు, జోబియా ఫాతిమా 994మార్కులు, ఎంఈసీ విభాగంలో పి. వికాస్‌కుమార్‌శెట్టి 992 మార్కులు సాధించారని వారు తెలిపారు. భవిష్యత్‌లో మరింతగా అత్యుత్తమ మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. ఇంటర్‌లోనూ విశిష్టమైన మార్కులు సాధించారని, ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement