జనగామ రూరల్: ఇంటర్ ఫలితాల్లో పట్టణంలోని ప్రెస్టెన్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి మరోసారి తమ ప్రతిభను నిరూపించుకున్నారని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె.ఎం. జయమని జాన్ తెలిపారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ ఫస్టియర్, సెకండియర్ సీఈసీలో వందశాతం, ఎంపీసీ, బైపీసీలో 80 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంపీహెచ్ డబ్ల్యూ ఒకేషనల్‌లో 1,000 మార్కులకు దైవానీ 972, వి.దీపిక971, సహారా 971, ఫస్టియర్‌లో 500లకు కె.హిందు 443 మార్కులు సాధించారని తెలిపారు. అన్ని గ్రూపుల్లోనూ అద్భుతమైన ఫలితాలను సాధించి విద్యా ప్రమాణాల్లో ముందంజలో ప్రెస్టెన్ సంస్థ నిలిచిందన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ కె.ఎం.జయమని జాన్, పాల్ విగ్, క్యారలిన్ విగ్, ప్రిన్సిపల్ ఎజ్రా అభినందించారు.


