జనగామ రూరల్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికల హవా సాగించారు. ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయిగా నిలిచారు. గతంలో మాదిరిగా అన్ని కేటగిరిల్లో బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ఫస్టియర్ జనరల్ విభాగంలో బాలురు 1,346 మందికి గాను 670 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 1,849 మందికి గాను 1,236 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 3,195 మందికి గాను 1,906 మంది ఉత్తీర్ణత సాధించి 59.66 శాతంగా ఉంది. ఫస్టియర్ ఒకేషనల్‌లో మొత్తం 1,016 మందికి గాను 529 మంది ఉత్తీర్ణత సాధించి 52.07 శాతంగా ఉంది. సెకండియర్‌లో బాలురు 1,254 మందికి గాను 755 మంది ఉత్తీర్ణత సాధించి 60.21 శాతంగా ఉంది. బాలికలు 1,773 మందికి గాను 1,432 మంది ఉత్తీర్ణత సాధించగా 72.25 శాతంగా ఉన్నారు. ఒకేషనల్‌లో మొత్తం 916 మంది విద్యార్థులకు 589 మంది ఉత్తీర్ణత సాధించి 63.97 శాతంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా ఫస్టియర్‌లో 22వ స్థానం, సెకండియర్‌లో 18వ స్థానంలో నిలిచింది. కాగా గత మూడేళ్ల నుంచి వరుసగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో టాపర్‌గా నిలిచింది.
సత్తా చాటిన కేజిబీవీలు
ఇంటర్ ఫలితాల్లో మరోసారి కేజీబీవీ విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలో మొత్తం 12 కేజీబీవీలు ఉండగా ఫస్టియర్‌లో 550 మందికి 408 మంది ఉత్తీర్ణత సాధించి, 74 శాతం నమోదైంది. సెకండియర్‌లో 314 మందికి 277 మంది ఉత్తీర్ణత సాధించి, 88.22 శాతంగా ఉంది. ఫస్టియర్‌లో కొడకండ్ల, తరిగొప్పుల వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో పాలకుర్తి కేజీబీవీ వంద శాతం ఉత్తీర్ణత సాధించింది.
ఎంజేపీల్లో..
ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలో నాలుగు కళాశాలలు ఉండగా ఫస్టియర్‌లో 78.5 శాతం, సెకండియర్‌లో 85.5శాతం ఉత్తీర్ణత సాధించారు.
మైనార్టీల కళాశాలల్లో..
జిల్లాలో రెండు మైనార్టీ గురుకుల కళాశాలు ఉన్నాయి. జనగామ బాలురు మైనార్టీ విద్యార్థులు ఫస్టియర్‌లో 76 శాతం, సెకండియర్‌లో 87.09 శాతం ఉత్తీర్ణత సాధించారు.
సోషల్ వెల్ఫేర్‌లో..
సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లాలో మొత్తం 5 కళాశాలలు ఉండగా ఇందులో ఫస్టియర్‌లో 243 మంది విద్యార్థులకు 150మంది ఉత్తీర్ణత సాధించి 61.70 శాతం ఉండగా, సెకండ్ ఇయర్‌లో 255 మందికి గాను 203 మంది ఉత్తీర్ణత సాధించి 80 శాతం ఉన్నారు.
జూనియర్ కళాశాలల్లో
జిల్లా వ్యాప్తంగా 7 జూనియర్ కళాశాలలు ఉండగా మొత్తం 868 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 454 మంది ఉత్తీర్ణత సాధించి 52.30 శాతంగా ఉంది. ఇందులో జనరల్‌లో 566 మందికి 264 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో 302 మందికి 190 మంది ఉత్తీర్ణత సాధించి 62.91 శాతంగా ఉంది.
ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన
విద్యార్థినులు
గతం కంటే పెరిగిన ఉత్తీర్ణతా శాతం
ఫస్టియర్‌లో ఫలితాల్లో 59.66శాతం ఉత్తీర్ణత
సెకండియర్‌లో 72.25శాతం ఉత్తీర్ణత
మొత్తం ఉత్తీర్ణతా శాతం 68.11
రాష్ట్రస్థాయిలో ఫస్టియర్‌లో జిల్లాది 22వ స్థానం
సెకండియర్‌లో 18వ స్థానం
ఇంటర్ ఫలితాలు
(శాతంలో)
2022 77.93
2023 63.70
2024 62.44
2025 64.60
2026 68.11


