సరస్వతి నమస్తుభ్యం!
● భక్తిశ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు
● వేదమంత్రోచ్ఛరణలు..
సామూహిక అక్షరాభ్యాసాలు
జనగామ: జిల్లావ్యాప్తంగా వసంత పంచమి పర్వదినం శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యాదేవి శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయాల్లో విశే ష పూజలు, అలంకరణలు జరగగా, వేద పండితు ల మంత్రోచ్ఛరణల మధ్య చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని భవానీనగర్ సరస్వతీ మాత ఆలయం, బతుకమ్మకుంట శ్రీవిజయదుర్గమ్మ ఆల యం, సంతోషి మాత ఆలయాలతో పాటు పట్టణంలోని బీరప్పగడ్డ శ్రీసరస్వతి శిశు మందిర్, వాసవి క్లబ్, గెలాక్సీ లయన్స్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ డైమండ్ సంయుక్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గట్టు శ్రీనివాస్ సహకారంతో అంబేద్కర్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులకు అక్షరాభ్యాసంతో పాటు స్కూల్ బ్యాగులు, పలకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి గెలాక్సీ జోన్ చైర్మన్ బుస్సా సిద్దేశ్వర్, అధ్యక్షులు తాడూరు సంతోష్, సోమేశ్వర్, రామిని ఈశ్వర్, అంగన్ వాడీ సూపర్‌వైజర్ పూర్ణిమ, టీచర్ అనిత పాల్గొన్నారు.
సరస్వతి నమస్తుభ్యం!


