పాలకుర్తిలో కల్యాణ మండపం ప్రారంభం
పాలకుర్తి టౌన్: ప్రజాప్రభుత్వంలో మహిళల అభివృద్ధే తెలంగాణ ప్రగతి దిక్సూచి అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)అన్నారు. మండల కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మండపాన్ని డీఆర్‌డీఏకు అప్పగించగా రూ.47లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్‌ను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డితో కలిసి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మాట్లాడుతూ..పాలకుర్తి నియోజకవర్గానికి ప్రజాప్రభుత్వం రూ.2వేల కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్,డీఆర్‌డీఓ పీడీ వసంత, అదనపు పీడీ నూరోద్దిన్, తహసీల్దార్ సరస్వతీ, ఎంపీడీఓ వేదవతి, డీఆర్‌డీఓ పల్లవి, మార్కెట్ చైర్‌పర్సన్ మంజుల, సర్పంచ్ కమ్మగాని విజయ పాల్గొన్నారు.
శ్రీసోమేశ్వరాలయంలో మంత్రి పూజలు
మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.


