కల్లుతాగిన కోతుల్లా ప్రవర్తించారు
● మద్యం మత్తులో నా మీద దాడికి
ప్రయత్నించారు
● కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే
పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపాటు
జనగామ: పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రాంభోత్సవ వేడకల్లో తరుచూ కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి చేతుల మీదుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా తనకు ఆహ్వానం పంపించగా, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్‌న్‌తో కలిసి సీతక్కను మర్యాదపూర్వకంగా స్వాగతం పలికామన్నారు. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలనే కొబ్బరికాయ కొట్టే సమయంలో గందరగోళం సృష్టించారు. కొందరు మద్యం మత్తులో వచ్చి, ఎమ్మెల్యే పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, కల్లుతాగిన కోతుల్లా కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జనగామ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కొడుకు ఆధ్వర్యంలో జరిగిన గుండాగిరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు పోకల జమునలింగయ్య, ఇర్రి రమణారెడ్డి, ఉల్లెంగుల సందీప్, రావెల రవి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


