నిన్న మాట్లాడిన నేస్తాలు..నేడు విగతజీవులై
భోజనం చేద్దామని వెళ్లి తిరిగిరాని లోకాలకు
‘నిన్ననే ఎంతో ఆనందంగా మాట్లాడితిరి కదరా..ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయిన్రా..శాశ్వతంగా మీ మాటలు ఇక వినలేమా..’ అని స్నేహితులు రోదిస్తున్నారు.. ‘మంచి భవిష్యత్ ఉందనుకున్నాం..కుటుంబానికి అండగా ఉంటారనుకున్నాం..మా జీవితమే మీరనుకున్నాం..మూడు పదులు రాకుండానే నూరేండ్లు నిండిపోయినయా కొడుకా..’ అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జిల్లా యువకులు దుర్మరణం చెందడంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదానికి కారణమైన కారు, మృతుల బైక్
జనగామ: యాదాద్రి జిల్లా ఆలేరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. భోజనం కోసం వెళ్లిన ఇద్దరు మిత్రులు నితిన్‌రెడ్డి, ఎండీ సిజాహిద్ చావులోనూ స్నేహాన్ని పంచుకున్నారు. జనగామ జిల్లా కేంద్రం వికాస్‌నగర్‌కు చెందిన వట్టి నితిన్‌రెడ్డి (28), జిల్లా ఆసుపత్రి ఏరియా గీతానగర్‌కు చెందిన ఎండీ సిజాహిద్ (24) ఇద్దరు స్నేహిహితులు. ఈనెల 21(బుధవారం) రాత్రి ఆలేరు మండల కేంద్రం సమీపం కందిగడ్డ శివారు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ డాబాకు భోజనం చేసేందుకు బుల్లెట్ బైక్‌పై వెళ్లారు. భోజనం చేసిన అనంతరం తిరుగు ప్రయాణమాయ్యారు. హైదరాబాద్ నుంచి హనుమకొండ వైపు వేగంగా వస్తున్న ఓ కారు వెనక నుంచి ఢీకొట్టడంతో బుల్లెట్‌పై ఉన్న ఇద్దరు స్నేహితులు ఎగిరి చెట్ల పడి, అక్కడికక్కడే మరణించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చెందిన పవన్ కళ్యాణ్ తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని నితిన్ తండ్రి వట్టి బాలసుధాకర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబాలకు అప్పగించారు. కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఆలేరు ఆస్పత్రికి తరలించారు.
ఒక్కగానొక్క కొడుకు..ఎదిగొస్తాడనుకుంటే
మృతుడు నితిన్‌రెడ్డి ఏకై క కుమారుడు. ఇతడికి ఓ సోదరి ఉంది. తండ్రి బాలసుధాకర్‌రెడ్డి వ్యాపారి, తల్లి అరుణ బచ్చన్నపేట 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. నితిన్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి జీతంతో పనిచేస్తున్నాడు. భోజనం చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరిన కొడుకు కొద్ది గంటల్లోనే విగతజీవిగా ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి.
తల్లిని కంటికి రెప్పలా చూసుకునేటోడు..
మరో మృతుడు సిజాహిద్ ఇంట్లో తీర్చలేని విషాదం అలుముకుంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి బొగ్గు వ్యాపారం చేస్తూ అన్నతో కలిసి సిజాహిద్ కుటుంబభారం మోస్తున్నాడు. తల్లి అనీఫా బేగాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సిజాహిద్ ఇక లేడనే వార్త తెలియడంతో తల్లి, అన్న, బంధువులు విలపిస్తున్నారు.
వట్టి నితిన్‌రెడ్డి, ఎండీ సిజాహిద్ (ఫైల్)
ఆలేరు రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు స్నేహితుల దుర్మరణం
శోకసంద్రంలో కుటుంబసభ్యులు,
స్నేహితులు
నిన్న మాట్లాడిన నేస్తాలు..నేడు విగతజీవులై
నిన్న మాట్లాడిన నేస్తాలు..నేడు విగతజీవులై
నిన్న మాట్లాడిన నేస్తాలు..నేడు విగతజీవులై
నిన్న మాట్లాడిన నేస్తాలు..నేడు విగతజీవులై


