అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు

Jan 23 2026 7:03 AM | Updated on Jan 23 2026 7:03 AM

అభివృ

అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు

జనగామ: జిల్లా కేంద్రంతో పాటు పాలకుర్తి, బచ్చన్నపేట, తరిగొప్పుల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రి ఽసీతక్క శుక్రవారం పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం అదనపు కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌, ఆర్డీఓ గోపిరామ్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, డీఈ, ఏఈలతో కలిసి కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ పనులను పరిశీలించారు. సుమారు రూ.10కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.

మంత్రి పర్యటన ఇలా..

పాలకుర్తి మండల కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఇందిరా మహిళా శక్తి పథకంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహా ఫంక్షన్‌ హాల్‌, డైనింగ్‌ హాల్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు. అక్కడ నుంచి నేరుగా జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జనగామ బైపాస్‌ రోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటెన్‌, శిల్పాల ఆవిష్కరణ, బస్టాండ్‌ చౌరస్తా జంక్షన్‌ వద్ద గల శిల్పాల ఆవిష్కరణ, ఆర్‌అండ్‌బీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసి న విగ్రహ ఆవిష్కరణ, ఆతర్వాత ఆర్‌అండ్‌బీ బంగ్లా ప్రారంభోత్సవం, మోడల్‌ మార్కెట్‌ మార్కెట్‌ ప్రారంభోత్సవం, బతుకమ్మ కుంటలోని వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం బచ్చన్నపేట మండల కేంద్రంలోని కేజీబీవీ ప్రారంభోత్సవం, తరిగొప్పుల పీహెచ్‌సీ సబ్‌ సెంటర్‌కు శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు.

జిల్లాలో నేడు మంత్రి సీతక్క పర్యటన

అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు1
1/2

అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు

అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు2
2/2

అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement