భాషల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

భాషల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు

Jan 23 2026 7:03 AM | Updated on Jan 23 2026 7:03 AM

భాషల

భాషల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

జనగామ రూరల్‌: భాషల అభివృద్ధికి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. గురువారం జిల్లా ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా శాఖ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. భాషల అభివృద్ధి సమాజ వికాసానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలుగు, హిందీ వంటి దేశీయ భాషల అభివృద్ధి కోసం భాషోపాధ్యాయుల సహకారంతో జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌, బండి కుమారస్వామి, బెజ్జమ్‌ సునీల్‌ కుమార్‌, చకిలేల శ్రీనివాస్‌, జగడంపల్లి శంకర్‌, ఆకుల సంజీవ్‌, పద్మిని, అరుణ్‌ జ్యోతి,ఎల్లంబట్ల రమేష్‌, వజ్రయ్య, ఎల్లయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు

శివునిపల్లి విద్యార్థులు

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–17 ఎంపిక పోటీల్లో సాఫ్ట్‌బాల్‌ విభాగంలో హాజరైన శివునిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు నర్సింగ సాత్విక్‌, గుగులోత్‌ మధుసూదన్‌ ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం కె.రమేశ్‌ తెలిపారు. ఈ నెల 23, 24వ తేదీల్లో నిజామాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా, రాష్ట్ర స్థాయికి ఎంపికై న వారిని హెచ్‌ఎం కె.రమేష్‌, పీడీ కె.రవి అభినందించారు.

చేనేత కార్మికులకు రుణమాఫీ

జనగామ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం కింద వ్యక్తిగత చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు చౌడేశ్వరీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడతగా జిల్లాలోని 104మంది లబ్ధిదారులకు మాఫీ అమలవుతుందన్నారు.

భాషల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు1
1/1

భాషల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement