‘కవర్‌’ భలే..పంట భళా! | - | Sakshi
Sakshi News home page

‘కవర్‌’ భలే..పంట భళా!

Jan 23 2026 7:03 AM | Updated on Jan 23 2026 7:03 AM

‘కవర్

‘కవర్‌’ భలే..పంట భళా!

లింగాలఘణపురం: శీతాకాలంలో కూరగాయ పంటల సాగులో చలి, చీడపీడల నుంచి రక్షణకు కవర్‌ (నాన్‌ ఓన్‌ క్రాప్‌ కవర్‌)లతో సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మండలంలోని కళ్లెంకు చెందిన రైతు నకీర్త శ్రీనివాస్‌. ఇప్పటికే సుమారు పదేళ్లుగా కూరగాయలు సాగుచేస్తున్న శ్రీనివాస్‌ ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నాడు. ప్రస్తుతం చలి తీవ్రతతో మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటోందని, అదేవిధంగా మొక్క దశలో అనేక చీడపీడలు ఆశిస్తాయని నాన్‌ ఓన్‌ క్రాప్‌ కవర్‌ ఏర్పాటు చేసి బీర, సోర, మిర్చి, కీర వంటి కూరగాయలను పండిస్తున్నాడు. విత్తనం నాటే దశలోనే కవర్‌లను ఏర్పాటు చేసి ఆయా కూరగాయలను బట్టి నెల రోజుల వరకు కవర్‌ అలాగే ఉంచి ఆ తర్వాత తొలగిస్తానని, తీగ జాతి పంటలకు కవర్‌ తొలగించి పందిళ్లు ఏర్పాటు చేస్తామని, దీంతో చీడపీడల నివారణతో పాటు మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయని అంటున్నాడు. ఒక్క ఎకరానికి సుమారు రూ.30వేల వరకు ఖర్చు అవుతుందని, ఒక్కసారి వాడిన కవర్‌ను రెండో పంటకు కూడా వినియోగించవచ్చని చెబుతున్నాడు.

కూరగాయల సాగులో

‘నాన్‌ ఓన్‌ క్రాప్‌ కవర్‌’

చలి, చీడపీడల నుంచి రక్షణ

‘కవర్‌’ భలే..పంట భళా!1
1/1

‘కవర్‌’ భలే..పంట భళా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement