గెలుపు గుర్రాల వేట | - | Sakshi
Sakshi News home page

గెలుపు గుర్రాల వేట

Jan 22 2026 7:17 AM | Updated on Jan 22 2026 7:17 AM

గెలుప

గెలుపు గుర్రాల వేట

గెలుపు గుర్రాల వేట డీసీసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి

జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో..

పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ

జనగామ: రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పటిష్టం చేయాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో స్క్రీనింగ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా కమిటీలు కీలక భూమిక పోషించనున్నాయి. ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధిత ఇన్‌చార్జ్‌ మంత్రి కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. డీసీసీ అధ్యక్షులు కన్వీనర్‌లుగా, పార్లమెంట్‌ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్‌ నాయకులు సభ్యులుగా ఉంటారు. కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపికలో ఈ కమిటీలదే తుది నిర్ణయం.

రెండు మున్సిపాలిటీల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు జిల్లా పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వార్డుల వారీ గా వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఆశావహులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ వచ్చేవరకు దరఖాస్తులను స్వీకరించి, ఆ తర్వాత వార్డు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతాం.

– లకావత్‌ ధన్వంతి,

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు, జనగామ

జిల్లాలో జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ మంత్రి ధనసరి సీతక్క చైర్మన్‌గా ఉండగా, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి కన్వీనర్‌, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ నియోజకవర్గ ఇనన్‌చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, టీపీసీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్‌తో పాటు కీలక నాయకులు ఈ స్క్రీనింగ్‌ కమిటీలో భాగస్వాములు కానున్నారు. జనగామలో 30, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 18 మొత్తంగా 48 వార్డులకు గాను కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎం పిక బాధ్యత ఈ కమిటీపై ఉంటుంది. ప్రస్తుతం వార్డుల వారీగా ఆశావహులకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో గుర్తించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే వరకు బరిలో నిలవాలని ఉత్సాహపడే నాయకుల నుంచి ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే అభ్యర్థులను ఖరారుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెడతారు. పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థుల వివరాలను సేకరిస్తూనే, ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు, స్థానిక రాజకీయ సమీకరణాలు పరిశీలించిన తర్వాతనే గెలుపు సాధించే అభ్యర్థులను తుది జాబితాలో ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్‌ కమిటీల ఏర్పాటు పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని, కష్టపడి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల అభ్యర్థుల

ఎంపికలో కీలకపాత్ర

నోటిఫికేషన్‌ వచ్చేవరకు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

కమిటీలో చైర్మన్‌గా

ఇన్‌చార్జ్‌ మంత్రి సీతక్క

గెలుపు గుర్రాల వేట1
1/2

గెలుపు గుర్రాల వేట

గెలుపు గుర్రాల వేట2
2/2

గెలుపు గుర్రాల వేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement