చిన్నరామన్‌చర్లలో సంపూర్ణ మద్యపాన నిషేధం
బచ్చన్నపేట: మండలంలోని చిన్నరామన్‌చర్ల గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తున్నట్లు గ్రామ సభలో గ్రామస్తులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ ఎండీ ఆజామ్ తెలిపారు. బుధవారం గ్రామసభ అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో భాగంగా మొదటి గ్రామసభలో పాలకవర్గం, గ్రామస్తులు కలిసి చేసిన తీర్మానం ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిషేధం అమలులో ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మిన వారికి లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని, అమ్ముతుండగా ఆధారాలతో సహా చూపించిన వారికి రూ.10వేల బహుమతి అందిస్తామన్నారు. అలాగే మద్యపాన నిషేధ కమిటీ కూడా 15 మంది సభ్యులతో వేశామన్నారు. చైర్మన్‌గా సర్పంచ్ ఆజాం, వైస్ చైర్మన్‌గా ఉప సర్పంచ్ కత్రి యాదయ్య, కన్వీనర్ అన్నబోయిన రాజులతో పాటు పలువురిని నియమించామన్నారు.


