మేడారం జాతరకు 130 ఆర్టీసీ బస్సులు | - | Sakshi
Sakshi News home page

మేడారం జాతరకు 130 ఆర్టీసీ బస్సులు

Jan 21 2026 7:05 AM | Updated on Jan 21 2026 7:05 AM

మేడారం జాతరకు 130 ఆర్టీసీ బస్సులు

మేడారం జాతరకు 130 ఆర్టీసీ బస్సులు

జనగామ: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. జనగామ డిపో ఆధ్వర్యంలో ప్రెస్టన్‌ మైదానంలో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక షెల్టర్‌ నుంచి ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం వరకు 130 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్‌ ఎస్‌.స్వాతి మంగళవారం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ బస్సులు మేడారం అమ్మవారి గద్దెల వరకు నడుస్తాయన్నారు. మహిళల ప్ర యాణానికి మహాలక్ష్మి స్కీమ్‌ ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. జనగామతో పాటు పరి సర ప్రాంతాల భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 7382 926139 నెంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement