విద్యుత్ లక్ష్యాలను వేగంగా పూర్తిచేయాలి
జనగామ: విద్యుత్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేందుకు అంకితభావంతో పని చేయాలని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఇంజనీర్లతో గత నెలలో పూర్తయిన పనులపై సమీక్షించడంతో పాటు ప్రస్తుత లక్ష్యాలపై దిశానిర్దేశం అందించారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో ఓవర్‌లోడ్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. వినియోగదారులు, రైతులు దళారులను నమ్మొద్దని, ఎలాంటి చెల్లింపులైనా మీసేవా లేదా ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై టోల్‌ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేయాలని తెలిపారు. సమీక్షలో డీఈ లక్ష్మినారాయణరెడ్డితో పాటు ఇంజనీర్లు ఉన్నారు.
కేసుల విచారణ
పారదర్శకంగా జరగాలి
రఘునాథపల్లి: పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యే కేసుల విచారణ పారదర్శకంగా ఉండాలని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల రికార్డు గది, నేరాల రికార్డులు, సంబంధిత వాహనాలు, పార్కు చేసిన స్థలం, స్టేషన్‌లోని ఇతర రికార్డులను పరిశీలించారు. పరేడ్ ఇన్‌స్పెక్షన్, మెన్ అండ్ ఆఫీసర్ టర్న్‌అవుట్, మెన్ కిట్ తదితరాలను పరిశీలించారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్, ఏఎస్సై బత్తిని కట్టమల్లు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్ ఉన్నారు.
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత
స్టేషన్‌ఘన్‌పూర్: రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ జి.వేణు, ఎస్‌ఐలు వినయ్‌కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సాధికారతకు శిక్షణ దోహదం
కాళోజీ సెంటర్: సాధికారత సాధించడానికి శిక్షణ దోహదపడుతుందని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి రాంనివాస్ అన్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు, కేర్ టేకర్లకు శిక్షణ కార్యక్రమం మంగళవారం రెండోరోజూ హనుమకొండ హరిత హోటల్‌లో కొనసాగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ.. సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని, వృత్తి నైపుణ్యం, సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. నిట్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం నిర్మాణాత్మక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా బాలికలకు నాణ్యమైన విద్యనందించడానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర అసిస్టెంట్ జెండర్ కోఆర్డినేటర్ సతీశ్, మాస్టర్ ట్రెనర్లు కృష్ణవేణి, సరస్వతి, జ్యోతి, జనగామ స్పెషల్ ఆఫీసర్ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
జనగామ రూరల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైధ్యాధికారి డాక్టర్ కె.మల్లికార్జున్‌రావు అన్నా రు. మంగళవారం మండలంలోని ఓబుల్‌కేశవాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్, ఫార్మసీ విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, ప్రభాకర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ లక్ష్యాలను వేగంగా పూర్తిచేయాలి
విద్యుత్ లక్ష్యాలను వేగంగా పూర్తిచేయాలి
విద్యుత్ లక్ష్యాలను వేగంగా పూర్తిచేయాలి


