ఏఎల్‌ఎం సాహసం | - | Sakshi
Sakshi News home page

ఏఎల్‌ఎం సాహసం

Jan 21 2026 7:05 AM | Updated on Jan 21 2026 7:05 AM

ఏఎల్‌

ఏఎల్‌ఎం సాహసం

చెరువులో ఈదుకుంటూ వెళ్లి

విద్యుత్‌ పనుల మరమ్మతు

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో అగ్రికల్చర్‌ ఫీడర్‌కు విద్యుత్‌సరఫరాకు అంతరాయం ఏర్పడంతో అసిస్టెంట్‌ లైన్‌మన్‌(ఏఎల్‌ఎం) సామల అశోక్‌ చెరువు మధ్యలో ఉన్న విద్యుత్‌ పోల్‌ వద్దకు నీటిలో ఈదుకుంటూ వెళ్లి మరమ్మతు చేసి ఔరా అనిపించాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామంలో 11 కేవీ అగ్రికల్చర్‌ ఫీడర్‌ ఇన్సులేటర్‌ పగిలి లైన్‌ బ్రేక్‌డౌన్‌ అయింది. అయితే విషయం తెలుసుకున్న విద్యుత్‌సిబ్బంది చెరువు మధ్యలో ఉన్న పోల్‌పై ఇన్సులేటర్‌ మార్చేందుకు భయపడ్డారు. అయితే అసిస్టెంట్‌ లైన్‌మన్‌ సామల అశోక్‌ ధైర్యంతో నడుముకు పైగా ఉన్న నీటిలో ఈదుకుంటూ వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఎర్త్‌ రాడ్‌తో పాటు మార్చాల్సిన ఇన్సులేటర్‌ను తీసుకుని చెరువులోకి ఈదుకుంటూ వెళ్లి పోల్‌ను ఎక్కి మరమ్మతు చేసి ఇన్సులేటర్‌ను మార్చాడు. దాంతో కొత్తపల్లి రైతులకు విద్యుత్‌ సరఫరా అంతరాయం సమస్యను పరిష్కరించాడు. కాగా విషయం తెలుసుకున్న ఏఈ పి.శంకర్‌తో పాటు తోటి విద్యుత్‌ సిబ్బంది, విద్యుత్‌ వినియోగదారులు ఏఎల్‌ఎం అశోక్‌ను అభినందించారు.

ఏఎల్‌ఎం సాహసం1
1/1

ఏఎల్‌ఎం సాహసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement