‘పది’లో ప్రథమస్థానంలో నిలవాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: పదో తరగతి పరీక్షలకు పక్కాగా యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్లాలని నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అఽన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో విజయోస్తు 2.0 యాక్షన్ ప్లాన్, స్పెషల్ క్లాసెస్, సర్వే, దిక్సూచి ఆచరణ, మాక్ టెస్ట్‌పాఠశాల సందర్శనలు, అభ్యాసదీపికల పంపిణీ, హాజరు, ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ టీమ్స్, ఇతర బోధన, బోధనేతర అంశాల మీద కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ..పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని, పీఎం పోషణ కార్యక్రమంలో మన కార్యక్రమం డేటా అప్లోడ్ చేసి ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు. పాఠశాలలకు కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లను ఆహ్వానించాలని పాఠశాల అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తేజస్వి, విద్యాశాఖ ఏడీ సత్యనారాయణమూర్తి, శ్రీనివాస్, నాగరాజు, రవికుమార్, చంద్రభాను వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


