నిజాలు బయటపెట్టినందుకే వేధింపులు | - | Sakshi
Sakshi News home page

నిజాలు బయటపెట్టినందుకే వేధింపులు

Jan 21 2026 7:05 AM | Updated on Jan 21 2026 7:05 AM

నిజాలు బయటపెట్టినందుకే వేధింపులు

నిజాలు బయటపెట్టినందుకే వేధింపులు

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ: కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నించడంతో పాటు అధికార పార్టీ అవినీతిని బయటపెడుతున్నందుకే మాజీమంత్రి హరీశ్‌రావును ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వేధించాలని ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ ర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బొగ్గు స్కాంపై సీబీఐ న్యాయ విచారణ జరిపించాలంటూ హరీశ్‌రావు లెటర్‌ రాసిన దానికి ప్రతికారంగానే టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసును ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందన్నారు. తనకు సంబంధం లేదంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులో హరీశ్‌రావు పిటిషన్‌ వేయగా, అనుకూలంగా కోర్ట్‌ తీర్పులు ఉన్నప్పటికీ పోలీసులు విచారణకు పిలువడం ఏంటన్నారు. రాజకీయ కక్ష సాధింపులు మానుకోకపోతే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement