మా గోస చూడండి సారూ!
జనగామ రూరల్: కుమారులు పట్టించుకోవడం లేదని బతికేదెట్లా అని తల్లిదండ్రులు, వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని చిరుద్యోగులు, భూమి డబ్బులు పడడం లేదని రైతులు పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చారు. ‘మా గోస చూడండి సారూ.. ’అంటూ అదనపు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి ప్రదక్షిణలు తప్పడం లేదని ప్రజల అవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్ తదితర అధికారులు ప్రజల నుంచి 20 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పరిష్కరించడానికి అధికారులు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం జరగాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుల పేర్లు రాగీరు యశోద, సత్యనారాయణ. బచ్చన్నపేట మండలం అలీంపూర్ గ్రామం. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహమైంది. తమకు ఉన్న 9 ఎకరాల భూమిని ఇద్దరు కుమారుల పేరుమీద పట్టా చేయించారు. కొడుకులు అన్నం పెట్టడం లేదని, బాగోగులు చూసుకోవడం లేదని వాపోతున్నారు. ఎకరం భూమిని తమ పేరిట పట్టా చేయాలని వినతిపత్రం అందజేశారు.
బైపాస్ రోడ్డులో డబ్బులు ఇవ్వడం లేదు
శామీర్‌పేట గ్రామం వద్ద బైపాస్ రోడ్డులో సర్వే నెంబర్ 311 నెంబర్ బదులుగా 312 నెంబర్ పడడంతో నాకు రావల్సిన నష్టపరిహారం అందడం లేదు. అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. కొంత మంది బెదిరిస్తున్నారు. వారసత్వంగా వస్తున్న సాగు భూమి నాది, విచారణ చేపట్టి న్యాయం చేయాలి.
–గుజ్జుల నాగయ్య, శామీర్‌పేట, జనగామ
కుమారులు పట్టించుకోవడం లేదు
ఎలా బతికేది?
ముగ్గురు పిల్లలను ఎలా సాకేది?
సమస్యల పరిష్కారానికి ‘గ్రీవెన్స్’కు
తరలొచ్చిన ప్రజలు
వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు
మా గోస చూడండి సారూ!
మా గోస చూడండి సారూ!


