రోడ్డు భద్రత అందరి బాధ్య
లింగాలఘణపురం: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రాణాలు కోల్పోయిన వారికే ఆ బాధ తెలుస్తుందని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. సోమవారం మండలంలోని నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీసీపీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీని వాస్‌రెడ్డి, ఎన్‌హెచ్ అధికారులు, ఆర్టీఓ అధికా రులు, బాధిత కుటుంబాలతో పాటు నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రోడ్డు వెడల్పు చేసి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంగ్ల పెడగాగి పోటీల్లో జాతీయస్థాయికి ఎంపిక
జనగామ రూరల్: ఈనెల17వ తేదీన ఎస్‌ఈఆర్‌టీ హైదరాబాద్‌లో జరిగిన సమృద్ధి స్కీం రాష్ట్ర స్థాయి ఆంగ్ల పెడగాగి పోటీల్లో మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ ఎర్రగొల్లపహడ్ ప్రధానోపాధ్యాయుడు సీహెచ్. వెంకటేశ్వర్లు రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొనగా ముగ్గురు మాత్రమే జాతీయస్థాయికి ఎంపిక అయ్యారు. వీరు ఈనెల 26న ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. జాతీయస్థాయికి ఎంపికైన వెంకటేశ్వర్లును సోమవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. హరిలాల్, వాణిశ్రీ, సత్తిరెడ్డి, సత్తయ్య, రామ్‌మోహన్, జంపయ్య, నరేందర్‌రెడ్డి, సుధీర్‌బాబు, డాక్టర్ భాస్కర్, విక్రమ్ పాల్గొన్నారు.
బుగులు వెంకన్న వేలంపాటల ఆదాయం రూ.21.25లక్షలు
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన వివిధ దుకాణాలకు 2026–27 సంవత్సరానికి గాను సోమవారం వేలం పాటలు నిర్వహించగా రూ.21.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావు తెలిపారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ భువనగిరి విభాగం పరిశీలకుడు నిఖిల్ పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజ సామగ్రి అమ్ముకోవడం, గండదీపం వద్ద నూనె, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన మొలుగూరి హరికిషన్ రూ. 14 లక్షలకు దక్కించుకున్నాడు. అంగడిలో పశువుల క్రయవిక్రయాలు, రహదారి రుసుం, దుకాణా పన్నులు వసూలు చేసుకోవడానికి పాలకుర్తికి చెందిన వీరమనేని హనుమంతు రూ.7.25 లక్షలకు దక్కించుకున్నాడు. జూనియర్ అసిస్టెంట్ మోహన్, అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత అందరి బాధ్య


