దుమ్ముతో జీవనం..గుంతల్లో ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

దుమ్ముతో జీవనం..గుంతల్లో ప్రయాణం

Jan 20 2026 9:14 AM | Updated on Jan 20 2026 9:14 AM

దుమ్మ

దుమ్ముతో జీవనం..గుంతల్లో ప్రయాణం

జనగామ: జనగామ–సిద్దిపేట జాతీయ రహదారి అద్దంలా మెరిసిపోతున్నా..అందులో బచ్చన్నపేట మాత్రం దుమ్ముతో ఊపిరి పీల్చుకోలేకపోతోంది. మండల కేంద్రం మధ్యలో మూడు కిలోమీటర్ల రహదారి పనులు నిలిచిపోయి సంవత్సరాలు గడుస్తుండగా, ఇప్పుడు పరిస్థితి ఇలా మారింది. అక్కడ ప్రజలు రోడ్డు మీదే కాదు, ఆరోగ్యంతో, ప్రాణాలతో కూడా పోరాడుతున్నారు.

మా ఆరోగ్యం, ప్రాణాలు మీ చేతుల్లోనే..

రోజూ వందల ట్రక్కులు దూసుకెళ్తుంటే దుమ్ము సుడిగుండాలు ఎగసిపడి టౌన్‌ మొత్తాన్ని కప్పేస్తోంది. వ్యాపారులకు దుకాణాల్లో కస్టమర్లు కనిపించడం కాదు...దుమ్మే ముందుగా కనిపిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు శ్వాస తీసుకోవడం కష్టమై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆస్తమా, దగ్గు, అలెర్జీలతో బచ్చన్నపేట కొత్త పేషెంట్లకు నిలయంగా మారిపోతోంది. ‘రోజూ దుమ్ము మింగి బతుకుతున్నాం.. ఇంత దుస్థితిలో జీవితం ఎలా సాగుతుందో చెప్పండి సార్‌..’ అంటూ ఓ వ్యాపారి కళ్లలో నీళ్లు పెట్టుకుని చెబుతున్నాడు. మరొకరు ‘కంకర రాళ్లు ఎగిరి పిల్లలమీద పడతా యేమో అనిపిస్తోంది.. రోడ్డుమీదికి వెళ్లడం కూడా భయంగా మారింది’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. బైపాస్‌ వివాదం ఏది ఏమైనా సరే బాధ మాత్రం ప్రజలదే. వివాదం పూర్తయ్యే వరకై నా తాత్కాలిక రోడ్డు, దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎన్నోసార్లు విన్నవించినా స్పందన లేదని మండిపడుతున్నారు. ‘కలెక్టర్‌ గారూ మా ఆరోగ్యం, ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఒక్కసారి మాపై దృష్టి సారించి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించండి. మాకు రోడ్డు కావాలి.. బతికే అవకాశం ఇవ్వాలి’ అని తీవ్ర మనోవేధనతో బతిమిలా డుతున్న ఈ గ్రామం ప్రజల దుఖం తీర్చాలని మానవతా వాదులు సైతం కోరుతున్నారు. ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పడినా.. సమస్యల పరిష్కారం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

బచ్చన్నపేటలో 3 కి.మీ. మేర నిలిచిన రోడ్డు పనులు

ఊపిరి ఆడనివ్వని దుమ్ముతో ఇబ్బందులు

శ్వాసకోశ వ్యాధుల బారిన ప్రజలు

గుంతల రోడ్డుతో ప్రమాదాలు

రోడ్డును బాగు చేసి ఆరోగ్యాలు

కాపాడాలని కలెక్టర్‌కు ప్రజల వినతి

దుమ్ముతో జీవనం..గుంతల్లో ప్రయాణం1
1/2

దుమ్ముతో జీవనం..గుంతల్లో ప్రయాణం

దుమ్ముతో జీవనం..గుంతల్లో ప్రయాణం2
2/2

దుమ్ముతో జీవనం..గుంతల్లో ప్రయాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement