‘హిమ’దారుల్లో..ఎన్నెన్నో అందాలు!
ఇటీవలి జిల్లాలో వాతావరణం చిత్రవిచిత్రంగా మారిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. తెల్లవారు జామున తీవ్ర చలి, ఆకాశాన్ని కప్పేస్తున్న మంచుతో తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు దుప్పటి విడిస్తే వణకాల్సి వస్తోంది. ఇక 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మండే ఎండలు ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. చలితో పాటు ఆకస్మిక ఎండలు పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలు కేసులు పెరుగుతుండగా ఆసుపత్రుల్లోకి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. –జనగామ
‘హిమ’దారుల్లో..ఎన్నెన్నో అందాలు!


