చిల్పూరు ఆలయంలో నేడు వేలంపాటలు
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి వివిధ దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈనెల 19(సోమవారం) మధ్యాహ్నం 11 గంటలకు దేవస్థానం కార్యాలయంలో వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. వేలంలో కొబ్బరికాయలు, పూజ సామగ్రి, అంగడిలో పశువుల క్రయ విక్రయాలు, తలనీలాల సేకరణ తదితర వాటిపై బహిరంగ వేలం, సీల్డ్ టెండర్లు నిర్వహిస్తున్నందున వేలంలో పాల్గొనేవారు సకాలంలో హాజరు కావాలని కోరారు.
జనగామ: పట్టణంలోని బాణాపురం హనుమాన్ ఆలయంలో ఆదివారం 51వ గీతా యజ్ఞం పూజాకార్యక్రమం జరిగింది. ఆలయ ప్రతినిధి విజయ్‌కుమార్ బజాజ్ మాట్లాడుతూ.. కర్మ, జ్ఞానం, భక్తితో మోక్షం సాధించడం సులభం కాదు, ధర్మాలను పరమాత్మకే వదిలి శరణాగతి కోరడం సులభమైన మార్గమని అన్నారు. శాంతి సౌఖ్యలతో వర్ధిల్లడం కోసం ప్రతి ఒక్కరూ గీతాయజ్ఞంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉత్సవంలో భక్తులు గిరిగాని రమేశ్, భాస్కర్‌రెడ్డి, రమేశ్, మురళి, శ్రీశైలం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
కాలభైరవస్వామికి ప్రత్యేక పూజలు
జనగామ: జిల్లా కేంద్రంలోని సాయినగర్ కాలభైరవ దేవస్థానంలో అమావాస్య పర్వదినం పు ర స్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం, సేవల్లో పాల్గొన్నారు. కూష్మాండ ద్వీపదర్శనం వైభవంగా జరుగగా, అనంతరం మల్లారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసా ద కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజ రయ్యారు. భక్తుల సమష్టి సహకారంతో జరిగి న ఈ కార్యక్రమం సాయినగర్ కాలనీ ఐక్యతను ప్రతిబింబించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అమావాస్య ప్రత్యేక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. కాలభైరవ స్వామివారి కృపతో శాంతి, సౌఖ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.
గట్టమ్మతల్లికి మొక్కులు
ములుగు రూరల్: ఆదిదేవత గట్టమ్మ తల్లికి మేడారం భక్తులు మొక్కులు చెల్లించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి బయలుదేరిన భక్తులు మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. భక్తులు అమ్మవారికి పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దెలకు పసుపు–కుంకుమ సమర్పించారు.
చిల్పూరు ఆలయంలో నేడు వేలంపాటలు


