ఆలేటి ఎల్లవ్వకు బోనాలు
పాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెర గ్రామ శివారు ఆలేటి ఎల్లవ్వ ఆలయంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జనగామ జిల్లా ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఒగ్గు డోళ్ల బృందం, బోనాల కోలాటం, పోతురాజల ఆలేటి ఎల్లవ్వ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఊర సంపత్, కాసర్ల రమేశ్, కొనుకుంట్ల అనిత, సోమ సత్యం, కొంరమ్మ, మల్లేష్, శివ, గణేష్, సాయి,పస్తం నగేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


