అయ్యయ్యో! | - | Sakshi
Sakshi News home page

అయ్యయ్యో!

Jan 18 2026 7:23 AM | Updated on Jan 18 2026 7:23 AM

అయ్యయ

అయ్యయ్యో!

– 8లోu

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026
జనగామలో రిజర్వేషన్ల తారుమారుతో ఆశలు గల్లంతు

పక్కవార్డుల వైపు ఆశావహుల చూపు

పురపోరుకు రంగం సిద్ధం

టికెట్ల కసరత్తులో రాజకీయ పార్టీలు

దక్షిణ భారత స్థాయి

సైన్స్‌ ఫెయిర్‌కు ఎంపిక

జనగామ రూరల్‌: జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయ, దక్షిణ భారత స్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎంపికవడం గర్వకారణమని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా, అడిషనల్‌ కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌లు అన్నారు. ఈ మేరకు ఇన్‌స్పైర్‌ విభాగంలో కేజీబీవీ విద్యార్థిని జి.అక్షిత, టీఎల్‌ఎం విభాగంలో లింగాలఘణపురం మండలంలోని కుందారం పాఠశాల ఎస్‌ఏ ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు బండోజు శ్రీనివాసాచారి, మ్యాన్‌ మేడ్‌ ఓజోన్‌ లేయర్‌ ప్రాజెక్టులో పట్టణంలోని అరబిందో హైస్కూల్‌కు చెందిన కె. మయూరి సదర్న్‌ ఇండియా సైన్స్‌ఫెయిర్‌కు ఎంపిక కాగా వారిని అభినందించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబర్చాలని వారు ఆకాక్షించారు.

వేయిస్తంభాల దేవాలయంలో మాసశివరాత్రి పూజలు

హన్మకొండ కల్చరల్‌: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠ అవధాని, అర్చకులు ప్రణవ్‌, సందీప్‌శర్మ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి ఆరాధన గరికపూజ, శ్రీరుద్రేశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో శ్రీరుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారిని ప్రతిష్ఠించి కలశస్థాపన, బాసికధారణ, యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి కల్యాణోత్సవం నిర్వహించారు. 11 మాసశివరాత్రులు శనివారంతో పూర్తయి మాఘమాసంలో వచ్చే ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినం వస్తుందని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.

రోడ్డు భద్రతపై అవగాహన

జనగామ: పట్టణంలోని నెహ్రూ పార్క్‌ వద్ద గల సెయింట్‌ పాల్స్‌ ఉన్నత పాఠశాలలో డీసీపీ రాజమహేంద్రనాయక్‌ రోడ్డు భద్రతపై విద్యార్థులకు శనివారం అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై పోటీలను నిర్వహించిన అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్‌నితిన్‌, ప్రిన్సిపల్‌ ఫాదర్‌ జోసఫ్‌, సీఐ, ఎస్సైలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఓపెన్‌ స్కూల్‌ ఫీజు

గడువు పెంపు

జనగామ రూరల్‌: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సుల పరీక్ష ఫీజును, రూ.50 ఆలస్య రుసుముతో జనవరి 17 నుంచి 25వ తేదీ వరకు, తత్కాల్‌ కింద జనవరి 26 నుంచి 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఫీజు చెల్లింపులో ఏమైన సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయం శంకర్‌రా వు (8919606868)ను సంప్రదించాలన్నారు.

డంపింగ్‌యార్డులో

మంటలు

జనగామ: మండలంలోని పసరమడ్ల గ్రామ పరిధిలోని చంపక్‌హిల్స్‌ వద్ద ఉన్న మున్సిపల్‌ డంపింగ్‌యార్డులో చెత్త అంటుకుని డంపింగ్‌యార్డులో మంటలు చెలరేగిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్‌ డంపింగ్‌యార్డులో ప్రమాదవశాత్తు చెత్త అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన మున్సిపల్‌ సిబ్బంది ఫైర్‌ ఇంజన్‌ వారికి సమాచారం అందించారు. కాగా డంపింగ్‌యార్డులో అన్ని రకాల వ్యర్థాలు ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. అయితే మంటలు ప్రమాదకరస్థాయికి వెళ్లకుండా అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు.

తెలంగాణ వారసత్వ శాఖతో ఎంఓయూ

కేయూ క్యాంపస్‌ : తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ (హెరిటేజ్‌ డిపార్ట్‌మెంట్‌), కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ విభాగం మధ్య శనివారం హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుది రింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌ రంజన్‌, కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.రామచంద్రం, రా ష్ట్ర హెరిటేజ్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అర్జున్‌ రావు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి.మనోహర్‌, హిస్టరీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ విభాగం అధిపతి డాక్టర్‌ చిలువేరు రాజ్‌కుమార్‌, డిప్యూ టీ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరాజు, ఓఎస్డీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంఓయూ ద్వారా ఇరు సంస్థలకు ప్రయోజనం కలుగనుంది.

జనగామ: మున్సిపల్‌ రిజర్వేషన్ల తాజా జాబితా వెలువడడంతో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ రాజకీయాల్లో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్లుగా మున్సిపల్‌ పీఠాలను నిశితంగా గమనిస్తూ, ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్‌, అధికార కాంగ్రెస్‌ కీలక నేతలు రిజర్వేషన్ల కేటాయింపులు అనుకున్న విధంగా రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా జనరల్‌ కోటాలో పోటీ చేసి పట్టాభిషేకం సాధించాలన్న ఆత్మవిశ్వాసంతో ఎదురు చూసిన పలువురు నేతలకు సొంత వార్డులో మహిళలు, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు రావడం షాక్‌ ఇచ్చింది.

చైర్మన్‌ రేసులో మేము సైతం..

జనగామ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని ఈసారి బీసీ జనరల్‌కు కేటాయించగా, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కొత్త మున్సిపాలిటీ ఎస్సీ జనరల్‌కు అవకాశం వచ్చింది. మరోవైపు జనగామలో రొటేషన్‌ విధానాన్ని అనుసరించడంతో 2019తో పోలిస్తే ఈసారి రిజర్వేషన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 3, 4, 6, 7, 18, 20, 25, 26, 29వ వార్డులు బీసీ జనరల్‌ నుంచి బీసీ మహిళా కోటాకు మారడంతో అనేక నాయకుల సమీకరణాలు గందరగోళానికి గురయ్యాయి. ఇందులో చైర్మన్‌ రేసులో కాంగ్రెస్‌ నుంచి కంచె రాములు, ఎర్రమల్ల సుధాకర్‌, ఎండీ.అన్వర్‌, దోర్నాల వెంకటేశ్వర్లు, తదితరులతో పాటు బీఆర్‌ఎస్‌ నుంచి మేకల రాంప్రసాద్‌, జూకంటి లక్ష్మీశ్రీశైలం, కన్నా పరశురాములు, నీల యాదగిరి, మారబోయిన పాండు వంటి నేతలు ఉన్నారు. ఇందులో పలువురికి తమకు సరిపోయే వార్డులు రాకపోవడంతో పక్కవార్డుల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో చైర్మన్‌ రిజర్వేషన్‌ ఎస్సీ జనరల్‌గా నిర్ణయించటంతో అక్కడ కూడా పోటీ మరింతగా పెరిగింది. కాంగ్రెస్‌ నుంచి కనకం రమేష్‌, సింగపురం దయాకర్‌, చేపూరి వినోద్‌, సింగపురం వెంకటయ్య, జీడి రమేష్‌, చేవూరి చిరంజీవి, తాటికొండ వినయ్‌, సింగపురం రాజయ్య, గుర్రం రాజు, జీడి ప్రసాద్‌, తదితరులు రేసులో ఉండగా, బీఆర్‌ఎస్‌ నుంచి కనకం గణేష్‌, తాడికొండ సురేష్‌, గుర్రం శంకర్‌, మారేపల్లి ప్రసాద్‌, గుర్రం ఏసు బాబు, గుర్రం శ్రీను, గుండె మల్లేష్‌ నేతలు సిద్ధంగా ఉన్నారు.

గెలుపు గుర్రాల కోసం..

రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక మున్సిపల్‌ నోటిఫికేషన్‌ విడుదల మాత్రమే మిగిలి ఉంది. దీంతో అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ, వామపక్షాలు గెలుపు గుర్రాలను గుర్తించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తూ, అంతర్గత విభేదాలను చక్కదిద్దుకునే దిశగా అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎవరు ఎక్కడి నుంచి బరిలో నిలుస్తారు, ఎవరికి చైర్మన్‌ అదృష్టం వరిస్తుందోననే ప్రశ్నలతో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.

కేటగిరీ వార్డులు శాతం

జనరల్‌ మహిళ 9 30

జనరల్‌ 6 20

బీసీ జనరల్‌ 5 16.67

బీసీ మహిళ 4 13.33

ఎస్సీ జనరల్‌ 3 10

ఎస్సీ మహిళ 2 6.67

ఎస్టీ జనరల్‌ 1 3.33

మొత్తం 30 100శాతం

రిజర్వేషన్లు ఖరారు

బస్సు ఎక్కేందుకు పోటీ పడుతున్న ప్రయాణికులు

జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

జనగామ: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సుదూ ర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న కు టుంబాల తిరుగు ప్రయాణం శనివారం నుంచే మొ దలైంది. ఆదివారం అమావాస్య కావడంతో మెజా ర్టీ కుటుంబాలు ముందుగానే పయనమవ్వడంతో ఆర్టీసీ, రైల్వే ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. జనగామ సహా పలు పట్టణాల్లో ఆర్టీసీ బస్టాండ్లు, ప్రైవేట్‌ ట్రావెల్‌ పాయింట్ల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించినప్పటికీ రద్దీ తగ్గలేదు. వరంగల్‌–హైదరాబాద్‌, సిద్దిపేట–జనగామ, సూర్యాపేట వైపు వెళ్లే హైవేలపై వాహన రద్దీ కనిపించింది. రిటర్న్‌ జర్నీతో బస్టాండ్లు, స్టేషన్లు కోలాహలంగా మారగా ఆర్టీసీ టికెట్‌ కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగాయి.

అయ్యయ్యో!1
1/7

అయ్యయ్యో!

అయ్యయ్యో!2
2/7

అయ్యయ్యో!

అయ్యయ్యో!3
3/7

అయ్యయ్యో!

అయ్యయ్యో!4
4/7

అయ్యయ్యో!

అయ్యయ్యో!5
5/7

అయ్యయ్యో!

అయ్యయ్యో!6
6/7

అయ్యయ్యో!

అయ్యయ్యో!7
7/7

అయ్యయ్యో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement