తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
జనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని పోలింగ్ బూత్‌ల వారీగా ఫొటో ఓటరుతో కూడిన తుది ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల జాబితాను శుక్రవారం కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, రాధాకృష్ణ విడుదల చేశారు. జనగామ పరిధిలో 66, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 36 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కార్యక్రమంలో మేనేజర్ జి.రాములు, టౌన్ ప్లానింగ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి రూ.1.25 లక్షల విరాళం
నర్మెట: మండలంలోని ఇప్పలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని రత్నతండాలో నూతనంగా నిర్మించ తలపెట్టిన దుర్గామాత ఆలయానికి సర్పంచ్ ధరావత్ రాజమణి రూ.1,25,116లు విరాళంగా అందజేశారు. ఈసందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీకి శుక్రవారం నగదు అందజేశారు. అనంతరం సర్పంచ్ కుటంబ సభ్యులను కమిటీ సన్మానించింది. కార్యక్రమంలో ధరావత్ రాజూ నాయక్, యువకులు, తండావాసులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బచ్చన్నపేట: మండలంలోని కేసిరెడ్డిపల్లి, బోనకొల్లూర్ గ్రామాల మధ్య పులి సంచరిస్తున్నట్లు ఇరుగ్రామాల రైతులు, ప్రజలు తెలిపారు. శుక్రవారం పలువురు మాట్లాడుతూ నాలుగు రోజులుగా సాయంత్రం వేళ జగ్గారెడ్డి తోట సమీపంలో పలువురు పులిని చూసినట్లు తెలిపారు. అలాగే గీతకార్మి కులు, గొర్రెల కాపర్లు కూడా చూశామని చెప్పారు. పులి కనిపించగానే భయంతో పరుగులు తీశామన్నారు. అది నడిచిన పాదాల అడుగులను గుర్తించామని రాత్రివేళ 30, 40 మంది రైతులు కలిసి కర్రలను, టార్చ్‌లైట్లను పట్టుకొని వ్యవసాయ బావుల వద్ద పహరా కాసినట్లు తెలిపారు. సంబంధిత ఫారెస్ట్ అధి కారులు పులిని పట్టుకొని వెళ్లి ఇరుగ్రామాల ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు రోడ్డు భద్రతపై అవగాహన
పాలకుర్తి టౌన్ : ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది విధుల్లోకి బయలుదేరే సమయంలో ఇంటికి నుంచి సురక్షితంగా బయలుదేరి, తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భా గంగా ప్రభుత్వ సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ జానకిరామ్‌రెడ్డి, ఎస్సై దూలం పవన్‌కుమార్, తహసీల్దార్ సరస్వతి, సూపరింటెండెంట్ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.
కాళేశ్వరం దేవస్థానం
హుండీల లెక్కింపు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, అనుబంధ దేవాలయాల హుండీలను శుక్రవారం లెక్కించారు. మూడు నెలల హుండీల ఆదాయం రూ.34,42,598 లక్షలు సమకూరినట్లు ఈఓ ఎస్.మహేశ్ తెలిపారు. హుండీల పర్యవేక్షణను దేవాదాయశాఖ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది, శ్రీ వల్లి సేవా ట్రస్ట్ (కరీంనగర్), శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, నరసింహ సేవా సమితి సభ్యులు, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల


