అంబరాన్నంటిన సంబురాలు
ముగిసిన సంక్రాంతి వేడుకలు
జనగామ: జిల్లావ్యాప్తంగా మూడు రోజుల పాటు సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నా రు. భోగి నుంచి కనుమ దాకా ప్రతీ ఊరు, ఇంటి వద్ద పండగ సందడి అంబరాన్నంటింది. భోగి ఉదయాన్నే భోగిమంటలు, రంగురంగుల ముగ్గులు, గోబ్బెమ్మలు, గాలి పటాల క్రీడలు గ్రామాలన్నీ పండగ కాంతులతో వెలిగిపోయాయి. సంక్రాంతి రోజున ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇంటింటా పాలు పొంగించి నవధాన్యాలతో కొత్త సంవత్సరానికి శుభారంభం పలికారు. మహిళలు మంగళగౌరి, సందెదీపాల నోములు, బొమ్మ ల కొలువులను భక్తిశ్రద్ధలతో నోచుకుని సంప్రదాయాని కి మరింత వన్నె తెచ్చారు. శుక్రవారం కనుమ పర్వదినం పురస్కరించుకుని గ్రామాల్లో సామూహిక వ్రతా లు, నోములు నిర్వహించగా, కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కటై పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
సంక్రాంతి, కనుమను పండగను పురస్కరించుకుని జిల్లాలోని చిల్పూరు బుగులోని శ్రీ వేంకటేశ్వరస్వామి, లింగాలఘణపురం మండలం జీడికల్ శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ పాలకుర్తి సోమేశ్వరస్వామి, బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దులగుట్ట, జనగామ బాణాపురం శ్రీ వేంకటేశ్వర, శ్రీ చెన్నకేశ్వర, శ్రీ సంతోషీమాత, పాతబీటు బజార్‌లోని శ్రీ రామలింగేశ్వర, చీటకోడూరు పంచకోసురామ లింగేశ్వర, సాయిబాబా, గీతాశ్రమం, బతుకమ్మకుంట శ్రీ విజయ దుర్గామాత ఆ లయాలు భక్తులతో కిటకిటలాడాయి.


