పురపాలిక ఎన్నికలకు సిద్ధంకండి
జనగామ: త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి సంబంధిత అధికారులతో మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌న్‌లోని మార్గనిర్దేశకాల ప్రకారం మున్సిపాలిటీల వార్డుల రిజర్వేషన్‌పై సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. పారదర్శక విధానం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే విధంగా చూడాలన్నారు. సమీక్షలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, మహేశ్వర్‌రెడ్డి, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.
మైనార్టీ సీట్లను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: జిల్లాలోని ముస్లిం మైనార్టీ పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాలలో మైనార్టీ రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మైనారిటీ అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్‌లో విడుదల చేశారు. జిల్లాలోని ఒక బాలు ర (జనగామ)లో, ఒక బాలికల (స్టేషన్ ఘన్‌పూర్) లోని పాఠశాల, కళాశాలలో గల సీట్లలో 80శాతం మైనారిటీలకు, 20శాతం నాన్ మైనార్టీలకు సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జి ల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి విక్రమ్ కుమార్, ప్రిన్సి పాల్ కె.కుమారస్వామి, పి.అనిల్ బాబు, అధ్యాపకులు తాయినాత్ సగీరా, పెట్లోజు సోమేశ్వరా చారి, రెహానా వార్డెన్ సల్మాన్, ఫసి పాల్గొన్నారు.
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్


