ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకం
హన్మకొండ: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకమ ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన శ్రీఆరైవ్..ఆలైవ్‌శ్రీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో ఆర్టీసీ హనుమకొండ డిపోలో రోడ్డు ప్రమాదాలపై ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన సదస్సు జరిగింది. పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారిందన్నారు. ఆర్టీసీకి సంబంధించి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఆర్టీసీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. రాత్రి సమయాల్లో బస్ బ్రేక్‌డౌన్ అయితే బస్సు వెనుక భాగంలో రేడియం స్టిక్కర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మేడారం జాతరలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్లపై బస్సులను నిలిపివేయవద్దని డ్రైవర్లకు సూచించారు. అనంతరం సుదీర్ఘ కాలంగా డ్రైవర్‌గా పనిచేస్తూ ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా విధులు నిర్వర్తించిన డ్రైవర్లను పోలీస్ కమిషనర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. సెంట్రల్ జోన్‌న్‌డీసీపీ కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భానుకిరణ్, డిపో మేనేజర్ ధరంసింగ్, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ వెంకన్న, సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్


