ట్రాఫిక్ నిబంధనలతో ప్రమాదాల నివారణ
జనగామ రూరల్: ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్లు ప్రమాదాలను నివారించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. శుక్రవారం ఆర్టీసీ డిపోలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసం–2026లో భాగంగా ‘చేరుకోండి, ప్రాణాలతో ఉండండి’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. వాహానాలు నడిటప్పుడు మత్తు పదార్థాలు తీసుకోవద్దన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ప్రమాదాలను నివారించడానికి పలు సూచనలు చేశారు. అనంతరం రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని చౌరస్తాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో చౌరస్తాలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిపో మేనేజర్ ఎస్.స్వాతి, కానిస్టేబుల్ సమద్, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్ర నాయక్


