నేటినుంచి వ్యవసాయ మార్కెట్‌లకు సెలవులు
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్‌లకు ఈనెల 14 (బుధవారం) నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు జనగామ ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, మార్కెట్‌కార్యదర్శి జన్ను భాస్కర్ మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. 14వ తేదీన భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ, 17న అడ్తిదారుల కోరిక మేరకు, 18వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించినట్లు వారు తెలిపారు. సెలవుల అనంతరం మార్కెట్ సేవలు 19వ తేదీ(సోమవారం) నుంచి పునఃప్రారంభమవుతాయన్నారు.
రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి
రఘునాథపల్లి: రోడ్డు భద్రతపై అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జనగామ వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి పాటించాలని పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా 200 వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్, పోలీస్ సిబ్బంది, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.
ఆలేటి ఎల్లవ్వ జాతర ఏర్పాట్ల పరిశీలన
పాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెర గ్రామశివారులో ఈనెల 14నుంచి 16 వరకు జరిగే ఆలేటి ఎల్లవ్వ జాతర ఏర్పాట్లను మంగళవారం వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్‌కుమార్ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు రాపాక సత్యనారాయణ, బమ్మెర సర్పంచ్ జిట్టబోయిన రమ్య ప్రశాంత్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జాతరల్లో నిరంతర విద్యుత్ సరఫరా
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ డివిజన్ పరిధిలో నిర్వహించే శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరలకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సీహెచ్.సంపతరెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పగూడెం, రంగరాయగూడెం, అక్కపెల్లిగూడెం, కోమటిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని చింతగట్టు శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణాన్ని డీఈ సారయ్యతో కలిసి ఎస్‌ఈ సంపత్‌రెడ్డి మంగళవారం సందర్శించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏడీఈ రణధీర్‌రెడ్డి, ఏఈ శివకుమార్, లైన్ ఇన్‌స్పెక్టర్ కాలురామ్‌నాయక్, లైన్‌మన్ సాయిబాబు, కాంట్రాక్టర్ రఘురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ స్టేషన్‌ల ముసాయిదా జాబితా విడుదల
జనగామ: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనగామ పురపాలక సంఘం పరిధిలోని 62 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి.రాములు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బూడిద గోపి, చొప్పరి సోమయ్య, బృంగి భాస్కర్, విజయభాస్కర్, కొత్తపల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి వ్యవసాయ మార్కెట్‌లకు సెలవులు
నేటినుంచి వ్యవసాయ మార్కెట్‌లకు సెలవులు
నేటినుంచి వ్యవసాయ మార్కెట్‌లకు సెలవులు


