నూతన సర్పంచులకు 5 రోజుల శిక్షణ
జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
జనగామ రూరల్: జిల్లాలో నూతంగా ఎన్నికై న 280 మంది సర్పంచులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓరియెంటేషన్ శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు విడతలుగా ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాలు జనగామ మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో వసతులతో నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. మొదటి విడతలో పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు చెందిన 91 మంది సర్పంచులకు ఈనెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు ఉంటుంది. రెండో విడతలో జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల పరిధిలోని 79 మంది సర్పంచులకు ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు, మూడో విడతలో స్టేషన్ ఘననపూర్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్‌న్‌పూర్, చిల్పూర్, రఘునాథపల్లి, జఫర్‌ఘఢ్, లింగాలఘణపురం మండలాల్లోని 110 మంది సర్పంచులకు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణల్లో పంచాయతీ రాజ్ చట్టం, పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, బాధ్యతలు వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. భోజనం, నివాసం వంటి వసతులు కల్పించనున్నారు. ఐదురోజులు పూర్తిగా హాజరైన వారికే సర్టిఫికెట్ జారీ అవుతుందన్నారు.
ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి
జిల్లాలో ఇంటర్ ఫలితాలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించాలని ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్పెషల్ ఆఫీసర్ వసుంధర దేవి, ఇంటర్ విద్యాధికారి జితేందర్‌రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను కలెక్టరేట్‌లో కలిసి ఇంటర్ ప్రగతి, వసతులపై చర్చించారు. ఈసందర్భంగా వారు వివరిస్తూ.. ఈవిద్యాసంవత్సరం జిల్లాలోని ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన బోధనతో అడ్మిషన్ల సంఖ్య పెరిగిందన్నారు. ఫిజిక్స్‌వాలా ద్వారా విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ కోచింగ్ ఇస్తున్నామన్నారు.
మూడు విడతల్లో క్రీస్తుజ్యోతిలో నిర్వహణ
తొలి విడత ఈనెల 19 నుంచి ప్రారంభం
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ: ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగలన్నిటిలో తెలుగువారికి ముఖ్యమైన సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. భోగితో భోగభాగ్యాలు, సంక్రాంతితో ఆనందాలు, కనుమతో కొత్త సంతోషాలు ప్రతి ఇంటా నిండాలని కలెక్టర్ కోరుకున్నారు. అందరి జీవితాల్లో ఈ పండుగ తెచ్చే నూతన వైభవం వెల్లివిరియాలని ఆశిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


