భక్తుల కొంగుబంగారం బంజర మల్లన్న
దేవరుప్పుల: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పెద్దమడూరు జోగు బ్రదర్స్ నిర్వహంచే బంజర మల్లన్న జాతర ఈనెల 14(బుధవారం) నుంచి ప్రారంభంకానుంది. మండలంలోని చిన్నమడూరు రెవెన్యూ పరిధి బంజర గ్రామ శివారు చెరువు సమీపంలో పూర్వం తలపెట్టిన పెద్దమడూరుకు చెందిన జోగు బ్రదర్స్ కుటుంబాలు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల పలు మండలాల నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో పెద్దఎత్తున శివభక్తులు చేరుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. మొదటిరోజు జోగు కుటుంబాలు శివసత్తుల పూనకాల మధ్య ఆలయానికి చేరుకొని సామూహికంగా వంటలు చేసి బోనాలు సమర్పిస్తారు. రెండోరోజు (గురువారం) శ్రీ మల్లికార్జునస్వామి (బంజరమల్లన్న)కు ఒగ్గు పూజారులచే పట్నాలు వేసి కళ్యాణోత్సవం జరుపుతారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జోగు బ్రదర్స్ ఆధ్వర్యంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం భద్రతను పర్యవేక్షించనుంది.
రేపటినుంచి పెద్దమడూరు పరిధిలో జాతర షురూ
ఉమ్మడి జిల్లా నుంచి శివభక్తుల రాక
భక్తుల కొంగుబంగారం బంజర మల్లన్న


