తుది ఓటరు జాబితా విడుదల
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డులవారీ తుది ఓటర్ల జాబితాను కమిషనర్లు మహేశ్వర్‌రెడ్డి, రాధాకృష్ణ వేర్వేరుగా విడుదల చేశారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 వార్డులు, ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డుల పరిధిలో పురుషులు, మహిళలు, ఇతరులను విభజించి జాబితాను రూపొందించారు.
జనగామ మున్సిపాలిటీలో..
జనగామ మున్సిపాలిటీలో 44,045 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 21,358, మహిళలు 22,678, ఇతరులు 9 మంది ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 16వ తేదీన పోలింగ్ బూతుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను బూత్‌ల వారీగా అధికారికంగా ప్రకటించనున్నారు. జనగామలో గత ఎన్నికల్లో ఉన్న 60 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఈసారి రెండు పెరగడంతో 62కి చేరుకున్నాయి. ఈనెల 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో..
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డులకు గాను 36 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయి. మొత్తంగా ఓటర్లు 18,550 కాగా అందులో పురుషులు 8913, సీ్త్రలు 9636 ఉండగా ఇతరులు ఒక్కరున్నారు. నిబంధనల మేరకు ఫొటోలతో కూడిన ఓటర్ల తుదిజాబితాను ఏర్పాటు చేశారు. ఈనెల 13న పోలింగ్‌స్టేషన్లు, ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో టీపోల్‌లో నమోదు చేస్తారు.
స్టేషన్‌ఘన్‌పూర్
వార్డులు :18
ఓటర్లు :18,550
పురుషులు : 8,913
మహిళలు : 9,636
ఇతరులు : 01
పోలింగ్ బూత్‌లు : 36
జనగామ
వార్డులు : 30
ఓటర్లు : 44,045
పురుషులు : 21,358
మహిళలు : 22,678
ఇతరులు : 9
పోలింగ్ బూత్‌లు : 62
జనగామ మున్సిపాలిటీలో 44,045 ఓటర్లు..‘స్టేషన్’లో 18,550 మంది
నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా
తుది ఓటరు జాబితా విడుదల


