జిల్లా రద్దుకు కాంగ్రెస్ కుట్ర
జనగామ: జిల్లాను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజ ల్లో ఆందోళన కలుగుతోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జనగామ మున్సిపల్‌లో అభివృద్ధి, తదితర మౌలిక వసతి సౌకర్యాలు, నిధుల విడుదల తదితర వాటిపై పురపాలికలో కమిషనర్ మహేశ్వర్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు.. జిల్లా సాధన కోసం ప్రజలతో కలిసి చేసిన పోరా టాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి నిర్ణయాలపై వ్యతిరేక మాటలు మాట్లాడటం బాధాకరమని మండిపడ్డారు. జిల్లాను ఏర్పాటు చేసి, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని, నవోదయ స్కూల్ వంటి కీలక అడుగు వేసే సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు జిల్లా అవసరం లేదంటూ ప్రచారం చేయడం రాజకీయ కక్షసాధింపు తప్ప మరేమీ కాదన్నారు. జిల్లాను మూసివేయాలన్న ఎమ్మెల్యేలు కడియం, నాయిని రాజేందర్‌రెడ్డి ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేరని హెచ్చరించారు.
భూభారతి ఫెయిల్యూర్ వ్యవస్థ..
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సజావుగా నడుస్తుంటే రాజకీయ కక్షలతో భూభారతి అనే ఫెయిల్యూర్ వ్యవస్థను తెచ్చి మధ్యవర్తులు వందల కోట్ల ప్రజాధనాన్ని మాయం చేసుకునేలా అప్పగించారని పల్లా ఆరోపించారు. చలాన్ల వ్యవహారాల్లో భారీ మోసాలు జరిగినా, రైతులకు, కొనుగోలు దారులకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.
అభివృద్ధిపై ఫోకస్
పురపాలిక అభివృద్ధి కోసం రూ.30 కోట్లు తీసుకొచ్చానని, ప్రస్తుతంలో మరో రూ.19 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైకుంఠధామం రోడ్డుకు రూ.72 లక్షలతో రిపేర్లు చేస్తామని, ఇందుకు సంబంధించి టెండరు ప్రక్రియ త్వరలోనే ఉంటుందన్నారు.
ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు
భూభారతి కుంభకోణంలో వందల కోట్లు మాయం
మున్సిపల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీక్ష


