నిబంధనల ప్రకారమే దత్తత
జనగామ రూరల్: నిబంధనల ప్రకారమే పిల్లలను దత్తత తీసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. బుధవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చాంబర్‌లో రక్తసంబంధ దత్తత ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేశారు. జిల్లాకు చెందిన తల్లి తన సొంత అక్క కుమార్తెను చట్టప్రకారం దత్తత తీసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అధికారికంగా దత్తత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పిల్లల విద్య, ఆరోగ్యం, భద్రతపై పూర్తి బాధ్యత వహించి, మంచి భవిష్యత్‌ను అందించాలని సూచించారు. అలాగే పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మాత్రమే చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.కోదండరాములు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, సంబంధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పారదర్శకంగా యూరియా సరఫరా
రైతులకు యూరియా సరఫరాలో పారదర్శకత, సౌ లభ్యం, సమయపాలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ ద్వారా జిల్లాలో పంపిణీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా బుకింగ్ యాప్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 1,40,737 యూరియా సంచులు బుక్ చేయబడగా, వాటిలో 1,15,633 సంచులను రైతులు కేవలం 15 రోజుల వ్యవధిలోనే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 28,914 యూరియా సంచులు అందుబాటులో ఉన్నాయని మార్క్‌ఫెడ్‌కు 20,666 యూరియా సంచులకు ఇండెంట్ ఇవ్వడం జరిగిందని, ఇవి రాబోయే రెండు రోజుల్లో జిల్లాకు చేరనున్నాయన్నారు.
పిల్లలు లేనివారు చట్టబద్ధంగా
దరఖాస్తు చేసుకోవాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్


