సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఆదర్శం
● డీటీఓ జీవీఎస్‌గౌడ్
జనగామ: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా ని యమావళిని పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జీవీఎస్‌గౌడ్ సూచించారు. జనగామ ఆర్టీసీ డిపోలో గురువారం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మేనేజర్ స్వాతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీటీఓ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఆదర్శంగా నిలుస్తోందని, డ్రైవర్లు సైతం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపో సూపర్‌వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


