స్మారకం..విస్మరించి! | - | Sakshi
Sakshi News home page

స్మారకం..విస్మరించి!

Jan 2 2026 11:24 AM | Updated on Jan 2 2026 11:24 AM

స్మార

స్మారకం..విస్మరించి!

రూ.7.50 కోట్లు కేటాయింపు.. పెరిగిన తుమ్మచెట్లు.. చేయాల్సిన పనులు ఇవే..

నిలిచిపోయిన బమ్మెర పోతన స్మారక అభివృద్ధి పనులు

పాలకుర్తి టౌన్‌: తెలుగు భాషకు అజరామరమైన కీర్తితెచ్చిన మహాకవి బమ్మెర పోతన జన్మించిన బమ్మెరలో ఆయన పేరుతో చేపట్టిన ‘పోతన స్మారక నిర్మాణం’ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గతంలో ప్రారంభసమయంలో వేగంగా కొనసాగిన పనులు అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై సాహితీవేత్తలు, కవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వం బమ్మెర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం ప్యాకేజీలో భాగంగా రూ.7.50 కోట్లు కేటాయించింది. 2018 మే 28న అప్పటీ సీఎం కేసీఆర్‌ స్వయంగా బమ్మెరకు వచ్చి పనులకు శంకుస్థాపన చేశారు. బమ్మెరకు ప్రత్యేక చరిత్ర ఉండడంతో ప్రాధాన్యరీత్యా పనులు చేస్తూ వచ్చారు. కాంట్రాక్టర్‌ చొరవ చూపి పనులు పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టారు. అయితే బడ్జెట్‌ సరిపోకపోవడంతో పనులు చేయలేనని చేతులేత్తేశారు. ప్రస్తుతం మరో రూ.6.50 కోట్లు మంజూరు చేసినా కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు మరో కాంట్రాక్టర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. పోతన స్మారక మందిరంలో నిర్మించిన భవనాలు పూర్తయ్యాయి. కానీ, చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. గతేడాది మార్చిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బమ్మెరరలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టిన దాఖాలాలు లేవని స్థానికులు చెబుతున్నారు.

గత రెండేళ్ల నుంచి పర్యాటక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పోతన స్మారక అభివృద్ధి పనుల్లో పిచ్చి, తుమ్మచెట్లు పెరగడంతో అసాంఘిక కార్యాకపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.పగలు, రాత్రి తేడాలేకుండా మందుబాబులకు అడ్డాగా మారిందని కవులు, రచయితలు ఆందోళన చెందుతున్నారు.

మండలంలోని పోతన ఊరిలో చేస్తున్న పర్యాటక అబివృద్ధి పనుల్లో పోతన సమాధి, పోతన మోటతోలిన బావి, అక్కమాంబ వాగు, విద్యుత్‌, టైల్స్‌ పనులు, ప్లాస్టింగ్‌, పార్కింగ్‌, ఆర్చి గేట్లు, పోతన కాంస్య విగ్రహం, ఆర్ట్‌ క్రాప్ట్‌ భవనాలు పూర్తి చేయాల్సి ఉంది.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చారిత్రక ప్రదేశం

పర్యాటకాభివృద్ధిపై నీలినీడలు

బడ్జెట్‌ సరిపోక చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

కొత్త కాంట్రాక్టర్‌కు పనులు

అప్పగించాలని స్థానికుల డిమాండ్‌

స్మారకం..విస్మరించి!1
1/1

స్మారకం..విస్మరించి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement