జిల్లా అభివృద్ధిపథంలో ముందుకెళ్లాలి
● నూతన సంవత్సర వేడుకల్లో
కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ: జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు సహకారం అందిస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈసందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా కలెక్టర్ పిలుపు మేరకు..ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చినవారు పేద విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు, బ్లాంకెట్లు, నోట్‌బుక్స్, పెన్నులు వంటి వస్తువులను అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జెడ్పీ డిప్యూటీ సీఈఓసరిత, డీసీఓ కోదండరాములు, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, తహసీల్దార్లు హుస్సేన్, రవీందర్, మోసిన్ తదితర ఉన్నతాధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు.
భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
కలెక్టరేట్‌లో జిల్లా రవాణాశాఖ అధికారి జీవీఎస్ గౌడ్‌తో కలిసి కలెక్టర్ భద్రతా మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
టీఎన్‌జీఓ యూనియన్ క్యాలెండర్
ఆవిష్కరణ
జనగామ టీఎన్‌జీఓ యూనియన్ 2026 క్యాలెండర్‌ను జిల్లా యూనియన్ అధ్యక్షుడు చైర్మన్ ఖాజా షరీఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేరవరం ప్రభాకర్, అసోసియేట్‌అధ్యక్షులు రాజనర్స య్య, కోశాధికారి హాఫిజ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిపథంలో ముందుకెళ్లాలి


