సీఎంకు కొమ్మూరి శుభాకాంక్షలు
జనగామ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎంను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సత్కరించి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
సాక్షిప్రతినిధి, వరంగల్: వాణిజ్యపన్నులశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రావులు శ్రీధరాచారి బదిలీ అయ్యారు. సుమారు రెండున్నర సంవత్సరాలకు పైగా పనిచేసిన ఆయనను కమిషనర్ కమర్షియల్ టాక్స్ (సీసీటీ) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌లో జేసీగా ఉన్న తాళ్లపల్లి శ్రీనివాస్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు, నియామకాల్లో భాగంగా కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు మొదటగా జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేస్తున్న సీటీఓలు, డీసీటీఓలు, ఏసీటీఓలను కదిలించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు బదిలీల జాబితాలో ఉన్న వివిధ కేడర్‌లకు చెందిన అధికారులు, ఉద్యోగులనుంచి ఆప్షన్‌లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
నెలరోజుల్లో రూ.11లక్షల మొండి బకాయిల వసూలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రావాల్సిన వివిధ టెండర్ల మొండిబకాయిదారుల నుంచి రూ.10 లక్షల డీడీలను ఆలయ ఈఓ జప్తు చేశారు. గతంలో ఆలయానికి బకాయి ఉన్న టెండర్‌దారులు బినామీ పేర్లతో వేలంపాటలో పాల్గొన్నారు. బినామీ టెండర్‌దారులకు బకాయిదారుల పేరుమీదా తీసిన రెండు 5 లక్షల డీడీలను ఈవో జప్తు చేయడం ఆలయ చరిత్రలోనే సంచలనంగా మారింది. నెల రోజుల్లోనే రూ.11 లక్షల పాత మొండిబకాయిలను ఈఓ లక్ష్మీప్రసన్న రికవరీ చేయడంతో పాటు, మొండిబకాయిదారుల వివరాలతో గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై భక్తులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సౌత్‌జోన్ టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఉన్న కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్స్‌లో ఈనెల 3 నుంచి 6 వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఎంపికైందని స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య గురువారం తెలిపారు. జట్టులో జి.మోహన్‌దాస్, వి.శివరామ్, బి.వెంకటేశ్, కె. విశాల్ ఆదిత్య, కె.శ్రితిన్, జె.అనిరుధ్, కె.తులసినాఽథ్ ఉన్నారు. ఈ జట్టుకు హనుమకొండ వాగ్దేవి కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎ.నాగరాజు కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు.
సీఎంకు కొమ్మూరి శుభాకాంక్షలు


