వేలం ఆదాయం రూ.2.46లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఏడాది పాటు కొబ్బరికాయల విక్రయానికి వేలం నిర్వహించగా రూ.2.46 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. శనివారం దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ నిఖిల్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా నలుగురు వేలం పాటలో పాల్గొన్నారు. ఇందులో జీడికల్‌కు చెందిన కొండబోయిన లక్ష్మి రూ.2.46 లక్షలకు దక్కించుకుంది. గతంలో రూ.2.10 లక్షలు ఉండగా ఈసారి మరో రూ.36వేలు అధికంగా వచ్చింది. వేలంలో సర్పంచ్ కొండబోయిన మమత, ఈఓ వంశీ, సిబ్బంది భరత్, మల్లేశం, గ్రామస్తులు పాల్గొన్నారు.
నేడు పట్టణంలో
విద్యుత్ అంతరాయం
జనగామ: పట్టణంలో సాయినగర్ 11కేవీ లైన్ పరిధిలో ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేడు (ఆదివారం) విత్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎన్‌పీడీసీఎల్ ఏఈ సౌమ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయినగర్, శ్రీనగర్ కాలనీ, సాయిబాబా టెంపుల్, హౌసింగ్ బోర్డు, ఇందిరమ్మ కాలనీ ఏరియాలలో 11 కేవీ లైన్ పను ల నేపధ్యంలో ఈ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి 12వ సబ్‌జూనియర్ (బాలుర) సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం కుసుమ రమేశ్, పీడీ కొండ రవి తెలిపారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుగులోతు మధుసూదన్, సుంకరి రుత్విక్, గండికోట రాంచరణ్, గుర్రం నాని, మోటం మహేష్‌లు ఇటీవల ని ర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతి భ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
షార్ట్‌సర్క్యూట్‌తో
సామగ్రి దగ్ధం
రఘునాథపల్లి: షార్ట్ సర్క్యూట్‌తో ఓ షాపులో ని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల కథ నం ప్రకారం.. మండలకేంద్రంలోని ఖిలా షాపూర్‌లోని రోడ్డులో మునిగడప విజయేందర్ స్థలం అద్దెకు తీసుకుని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, కిరాణం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. శనివారం ఉదయం షాపులో అకస్మాత్తుగా షా పులో మంటలు చెలరేగాయి. షాపు నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు విజ యేందర్‌కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని స్థానికులతో కలిసి మంటలు ఆర్పే ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకునే సరికే షాపులోని సరుకులు, సామగ్రి బూడిదయ్యాయి. సుమారు రూ.2.50లక్షలు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని తహసీల్దార్ ఫణికిశోర్‌కు వినతిపత్రం అందించారు.
వేలం ఆదాయం రూ.2.46లక్షలు


