సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి
జనగామ: సమాచార హక్కు చట్టంపై అధికారులకు అవగాహన ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని స మావేశం హాలులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరు ల అభివృద్ధి సంస్థ వరంగల్, రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులకు ఆర్‌టీఐ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కుచట్టం పౌరులకు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం పొందే హ క్కును కలిగి ఉందన్నారు. ప్రతీ కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అప్పీలేట్ అథారిటీలు ద రఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. రీ జినల్ ట్రైనింగ్ మేనేజర్ మార్గం కుమారస్వామి, ట్రైనర్ మోహన క్రిష్ణ, జిల్లా కో ఆర్డినేటర్లు ఆర్‌టీఐపై అవగాహన కలిగించారు.
అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్


