ముగిసిన సమ్మక్క–సారలమ్మ జాతర వేలంపాటలు
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని తాటికొండ, జిట్టెగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని మల్లన్నగండి సమ్మక్క–సారలమ్మ జాతర వేలంపాటలను తాటికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. జాతర కమిటీ గౌరవ అధ్యక్షుడు, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, తాటికొండ సర్పంచ్ మారపాక సుజనశ్రీను, జిట్టెగూడెం సర్పంచ్ బాలునాయక్, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో వేలం పాటలు నిర్వహించారు. జాతరను పురస్కరించుకుని తాటికొండ, జిట్టెగూడెం గ్రామాల పరిధిలో, జాతర వద్ద కొబ్బరికాయలు, బెల్లం, కోల్లు, పెద్దతీర్థం(మద్యం) అమ్మకాల కోసం పోటాపోటీగా వేలంపాటలు జరిగాయి. కోళ్ల అమ్మకానికి రూ.3.90 లక్షలు, బెల్లం(బంగారం) అమ్మకానికి రూ.91వేలు, కొబ్బరికాయల టెండర్ రూ.1.22లక్షలు, పెద్దతీర్థం(మద్యం) టెండర్‌కు రూ.8.46లక్షలకు పలికాయి.


