2న శ్రీసోమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జనవరి 2న(శుక్రవారం) ఉద యం 10 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవా దాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహిచనున్నట్లు ఈఓ పేర్కొన్నారు.
గంగదేవిపల్లిని
సందర్శించిన ప్రతినిధులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. రేగొండ మండలం జూబ్లీనగర్ సర్పంచ్, ఉపసర్పంచ్‌లు మూలగుండ్ల లావణ్యశ్రీనివాస్‌రెడ్డి, బత్తుల శ్రీధర్, యువకులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, రఘునాథఽపల్లి మండలం ఖిలాషాపురం సర్పంచ్ శాగ కవిత, అశోక్, వార్డు సభ్యులు సందర్శించి అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వారా ఆదర్శంగా నిలిచి దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలు పొందిన తీరును గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వివరించారు. సర్పంచ్ కూసం స్వరూప, కాంగ్రెస్ నాయకుడు కూసం రమేశ్, అభివృద్ధి కమిటీల ప్రతినిఽధి కూసం లింగయ్య, డీటీఎం కరుణాకర్ పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల కోసం పోరాడేది ఎర్రజెండానే
జనగామ రూరల్: కార్మికుల హక్కుల కోసం శ్రమజీవుల బాధల నుంచి విముక్తి చేసేది ఎర్రజెండా మాత్రమేనని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో చామకూరి యాకూబ్, ఆది సాయిన్న, ఆకుల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి చొప్పరి సోమయ్య, గుగులోతు సఖి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్‌తో విద్యార్థుల్లో సేవాభావం
జఫర్‌గఢ్: ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమాజంపై బాధ్యత పెరుగుతాయని ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జానీనాయక్ పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా విద్యార్థినులచే ఏర్పాటు చేసిన ఏడు రోజుల ప్రత్యేక ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ్ స్వప్న, ఎన్‌ఎస్‌ఎస్ పోగ్రాం అఫీసర్ లక్ష్మి, కాకతీయ యూనివర్సిటీ అడ్వైజర్ కమిటీ సభ్యులు అట్ల రాజు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
2న శ్రీసోమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
2న శ్రీసోమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు


